The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
ఇమామ్-ఉల్-హక్ (జననం 1995, డిసెంబరు 22) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో, పాకిస్తాన్ తరపున రెండవ బ్యాట్స్‌మన్‌గా,అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొత్తం మీద పదమూడవ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. 2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన 33 మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.
2025 ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా
భారతదేశంలోని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్ రాజ్ జిల్లాలో, గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది.ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహా కుంభమేళా అని నామకరణం చేశారు. ఈ కుంభమేళ 45 రోజుల పాటు సాగనుంది.
సంక్రాంతికి వస్తున్నాం అనేది 2025లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 14న థియేటర్లలో విడుదల చేశారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ఛత్రపతి షాహు భోంస్లే I (1682–1749 CE) అతని తాత, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యం ఐదవ ఛత్రపతి. భోంస్లే కుటుంబంలో జన్మించిన అతను పెద్ద కుమారుడు, వారసుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కుమారుడు. అతను చాలా చిన్న వయస్సులోనే బంధించబడ్డాడు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణించే వరకు మొఘలులచే బందీగా ఉన్నాడు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
విరాట్ కోహ్లీ భారతీయ క్రికెటరు . రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటరు. 2023 సెప్టెంబరు నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్లో 77 సెంచరీలు చేసాడు — 29 టెస్టు క్రికెట్లో, 47 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు), 1 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20Is)లో 2008 ఆగస్టులో శ్రీలంకపై తన తొలి వన్డే ఆడాడు.
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఛావా 2025లో విడుదలైన హిందీ చారిత్రక యాక్షన్ సినిమా. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ఛావా ఆధారంగా మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు శంభాజీ కథాంశంతో నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్‌పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవెన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది.
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు 1952 నుండి అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి సభ్యునిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నియంత్రిస్తుంది. టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20) ఫార్మాట్లలో PCB గానీ, ఇతర ప్రాంతీయ లేదా అంతర్జాతీయ క్రికెట్ సంస్థలు గానీ నిర్వహించే క్రికెట్ పర్యటనలు, టోర్నమెంట్లలో పాకిస్తాన్ పోటీపడుతుంది.
హానికరమైన సైబర్ కార్యకలాపాలు ప్రజల భద్రతకు, మన జాతీయ, ఆర్థిక భద్రతకు ముప్పు కలిగిస్తాయి. సైబర్ క్రైమ్, లేదా కంప్యూటర్-ఆధారిత నేరం, ఇది కంప్యూటర్, నెట్‌వర్క్‌తో కూడిన నేరం. కంప్యూటర్ నేరం వ్యవహారంలో ఉపయోగించబడి ఉండవచ్చు లేదా అది లక్ష్యంగా ఉండవచ్చు ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు (Cyber Crimes) అంటారు .
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
షహాబుద్దీన్ ముహమ్మద్ షాహ్ జహాఁ పూర్తి పేరు అల్ హజ్రత్ అబుల్-ముజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షాజహాన్ (బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్-ఖాఖాన్ అల్-ముకర్రం, అబుల్-ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్, సాహిబే ఖిరానే సాని, షాహ్ జహాఁ I పాద్షాహ్ గాజి జిల్లు'ల్లాహ్ [ఫిర్దోస్-ఆషియాని]) (ఇంకనూ షాహ్ జహాఁ, షాజెహాన్, షాజహాన్, షాజహాను అని కూడా పలుకుతారు. (ఉర్దూ : شاه جهان), జననం జనవరి 5, 1592 ; మరణం జనవరి 31, 1666. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి, 1628 నుండి 1658 వరకూ భారతదేశాన్ని పరిపాలించాడు.
నోబెల్ బహుమతి పొందిన భారతీయులు
1901లో తొలిసారిగా స్థాపించబడిన నోబెల్ బహుమతిని 2018 సంవత్సరంలో మొత్తం 904 మంది వ్యక్తులుకు, (వారిలో 852 మంది పురుషులు, 52 మంది మహిళలు) 24 సంస్థలకు అందించారు. గ్రహీతలలో 11 మంది భారతీయులు ( వారిలో నలుగురు భారతీయ పౌరులు, ఏడుగురు భారతీయ పూర్వీకులు లేదా వారి నివాసులు). రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పురస్కారం పొందిన మొదటి భారతీయ పౌరుడు.