The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. అంతేకాని సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది (చెదిరి) మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందన్న దృగ్విషయం రామన్ ఎఫెక్ట్ కాదు. కాని సముద్రపు నీలి రంగుకీ రామన్ ప్రభావానికి బొత్తిగా సంబంధం లేకపోనూ లేదు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించబడ్డాయి (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం ఆర్థికశాస్త్ర బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.
చిలకమర్తి లక్ష్మీనరసింహం ( సెప్టెంబరు 26, 1867 - జూన్ 17, 1946) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
హానికరమైన సైబర్ కార్యకలాపాలు ప్రజల భద్రతకు, మన జాతీయ, ఆర్థిక భద్రతకు ముప్పు కలిగిస్తాయి. సైబర్ క్రైమ్, లేదా కంప్యూటర్-ఆధారిత నేరం, ఇది కంప్యూటర్, నెట్‌వర్క్‌తో కూడిన నేరం. కంప్యూటర్ నేరం వ్యవహారంలో ఉపయోగించబడి ఉండవచ్చు లేదా అది లక్ష్యంగా ఉండవచ్చు ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు (Cyber Crimes) అంటారు .
సంక్రాంతికి వస్తున్నాం అనేది 2025లో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 14న థియేటర్లలో విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
అగ్నిపర్వతం అంటే, గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో (పై పొర -క్రస్టు) ఏర్పడే చీలిక. ఉపరితలం క్రింద, శిలాద్రవం ఉండే గది నుండి ఈ చీలిక ద్వారా వేడి లావా, అగ్నిపర్వత బూడిద, వాయువులూ వత్తిడితో బయటికి చిమ్ముతాయి. భూమిపై అగ్నిపర్వతాలు ఎందుకు ఉంటాయంటే దాని పెంకు 17 ప్రధాన, దృఢమైన టెక్టోనిక్ పలకలుగా విభజించబడి ఉంది.
అలెగ్జాండర్ (సా.పూ 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ కు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని బాసిలియస్ అంటారు), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III అని, అలెగ్జాండర్ ది గ్రేట్ (గ్రీకులో అలెగ్జాండ్రోస్ హో మెగాస్) అనీ పిలుస్తారు. అతను సా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
బాల కార్మికులు (ఆంగ్లం: Child labour) 18 సంవత్సరాల లోపు, సాధారణ పాఠశాలలో చేరి చదువుకోవాల్సిన వయసు సామర్థ్యానికి ఆటంకం కలిగించే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, నైతికంగా హాని కలిగించే ఈ విధమైన పని ద్వారా పిల్లల శ్రమ దోపిడీ చేయడాన్ని బాల కార్మికుల వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల చట్టంచేసి ఇటువంటి దోపిడీని నిషేధించారు, అయినప్పటికీ ఈ చట్టాలు పిల్లలందరి పనిని బాల కార్మికులుగా పరిగణించవు. మినహాయింపులలో బాల కళాకారుల పని, కుటుంబ విధులు, పర్యవేక్షించబడిన శిక్షణ అమిష్ పిల్లలు, అలాగే అమెరికాలోని స్వదేశీ పిల్లలు అభ్యసించే కొన్ని రకాల పిల్లల పని.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
2025 ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా
భారతదేశంలోని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్ రాజ్ జిల్లాలో, గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది.ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహా కుంభమేళా అని నామకరణం చేశారు. ఈ కుంభమేళ 45 రోజుల పాటు సాగనుంది.
ఎన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మన దేశం (1949) 1962వ సం చిత్రం శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ ను చేర్చలేదు.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రాజమండ్రి
దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, 1957లో రాజమండ్రిలో స్థాపించిన ఆర్ట్ గ్యాలరీ. ఇది గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. దామెర్ల రామారావు, ఆయన భార్య దామెర్ల సత్యవాణి, చేమకూర సత్యన్నారాయణ, రామారావుగారి మిత్రుడు వరదా వెంకటరత్నం, భగీరథీ, మాదేటి రాజాజి, కాళహస్తి పార్వతీశం, శీలా వీర్రాజు వంటివారి చిత్రాలు ఈ ఆర్ట్‌గేలరీలో రెండు బ్లాకుల్లో ప్రదర్శనకు ఉంటాయి.
వికీపీడియా:శుద్ధి నీటి శుద్దీకరణ అనేది అవాంఛనీయ రసాయనాలు, జీవ కలుషితాలు, వదిలివేయబడిన ఘనపదార్థాలు, వాయువులను నీటి నుండి తొలగించే ప్రక్రియ. నిర్దిష్ట ప్రయోజనాల కోసం నీటి సుద్దతను ఉత్పత్తి చేయడమే లక్ష్యం. మానవ వినియోగం (త్రాగునీరు) కోసం చాలా నీరు శుద్ధి చేయబడి, క్రిమిసంహారకమవుతుంది, అయితే వైద్య, ఔషధ, రసాయన, పారిశ్రామిక అనువర్తనాలతో సహా పలు ఇతర ప్రయోజనాల కోసం కూడా నీటి శుద్దీకరణ జరుగుతుంది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
జగ్గీ వాసుదేవ్, "సద్గురు" గా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది.
విజ్ఞానశాస్త్ర ప్రదర్శన లేదా సైన్స్ ఫెయిర్ అనగా సాధారణంగా పోటీదారులు వారు సృష్టించిన విజ్ఞానశాస్త్ర ప్రాజెక్ట్ ఫలితాలను నివేదిక, ప్రదర్శన బోర్డు, నమూనాల రూపంలో ప్రదర్శించే ఒక పోటీ. విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు గ్రేడ్ పాఠశాలల, ఉన్నత పాఠశాలల లోని విద్యార్థులు విజ్ఞాన, /లేదా సాంకేతిక కార్యకలాపాలలో పాల్గొనేలా చేస్తాయి.ఈ ప్రదర్శన విద్యార్థులు సంవత్సరమంతా చేసిన పనిని ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ఒక వేదిక. ఇది విద్యార్థులలో ప్రేరణ కల్పిస్తుంది, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని తెలుసుకునే పరిపుష్టిగా (feed back) ఉంటుంది.