The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21 న నిర్వహించబడుతుంది. 2012, నవంబరు 28న యునెస్కో వారిచే తీర్మానించబడిన ప్రపంచ అటవీ దినోత్సవం, 2013 మార్చి 21న తొలిసారిగా నిర్వహించబడింది. ప్రస్తుత, ముందు తరాల వారికి అడవుల ప్రాముఖ్యత, ప్రయోజనాలను తెలియజేయడంకోసం ఈ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూనిమ్న కక్ష్యలో పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా (నాసా), రష్యా (రోస్కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇ ఎస్ ఏ), కెనడా (సి ఎస్ ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రపు స్వామిత్వం (ఓనర్షిప్), దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి, ఐఎస్ఎస్, మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికీ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
అనేకములగు అర్థములు వచ్చునట్లుగా వాక్యములందు శబ్దములను కూర్చుట శ్లేషాలంకారము అనబడును. ఉదాహరణ: రాజు కువలయానందకరుడు. వివరణ :- రాజు = ప్రభువు, చంద్రుడు కువలయము= భూమి, కలువ పూవు ఈ పదములకు రెండు అర్థములు ఉండుట వలన ప్రభువు భూమికి ఆనందము కలిగించే వాడు అనీ చంద్రుడు కలువ పూలకు ఆనందము కలిగించే వాడు అనీ రెండు అర్ధములు వస్తున్నాయి.'శ్లేష' సహాయంతో కవులు ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాలు వ్రాసి నారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయమైన ఆనందనిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహం, విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం. విజయనగర చక్రవర్తిగా నరసింహరాయలు ఉన్న కాలంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం ఖాళీ కావడంతో ఆపద్ధర్మంగా, శ్రీవారి అర్చకత్వాన్ని మధ్వ సాధువు, గురువు వ్యాసరాయలు పన్నెండేళ్ళ పాటు నిర్వహించాడు. ఆ కాలంలోనే వ్యాసరాయలు ఆనందనిలయం విమానంపై ఉన్న శ్రీనివాసుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠచేసి దాన్నే విమాన వేంకటేశ్వరుడిగా ప్రచారానికి తీసుకువచ్చాడు.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలంలోని లాం గ్రామం కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ 2025లో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్ & ఈఫోర్ సంస్థ బ్యానర్‌పై మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చవారా నిర్మించిన ఈ సినిమాకు జితు అష్రఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో ఫిబ్రవరి 20న విడుదలైన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేయగా, సినిమాను మార్చి 7న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేశారు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినిమా దర్శకుడు, పాటల రచయిత. అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ 2008లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన కొత్త బంగారు లోకం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి ఆదరణ పొందడమేకాకుండా, 2008 సంవత్సరంలో విజయవంతమైన చిత్రాలలలో ఒకటిగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.