The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24 న నిర్వహించబడుతుంది. భయంకరమైన అంటువ్యాధైన టీబీ(క్షయ) దేశంలో ప్రతి సెకనుకు ఒక్కరికి సోకుతున్నదని, ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962ను క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
డేవిడ్ ఆండ్రూ వార్నర్ (జననం 1986 అక్టోబరు 27) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరు. వార్నర్ 132 సంవత్సరాలలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అనుభవం లేకుండా ఏ ఫార్మాట్లోనైనా జాతీయ జట్టుకు ఎంపికైన మొట్ట మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్.
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
నికోలస్ పూరన్ ( ; జననం 2 అక్టోబర్ 1995) ఒక ట్రినిడాడియన్ క్రికెటర్, అతను ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు, అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు అప్పుడప్పుడు కెప్టెన్‌గా ఉంటాడు. అతను వెస్ట్ ఇండియన్ డొమెస్టిక్ మ్యాచ్‌లలో ట్రినిడాడ్, టొబాగో తరపున, IPL లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కూడా ఆడతాడు. అతను సెప్టెంబర్ 2016లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది.
భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం.1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియం
ACA–VDCA క్రికెట్ స్టేడియం ( ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం) విశాఖపట్నంలోని బహుళ ప్రయోజన స్టేడియం. దీన్ని ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఉపయోగిస్తారు. స్టేడియంలో రెండు అంతస్థులు ఉన్నాయి.
డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ది సరిహద్దుల కమిషన్) లేదా సరిహద్దు కమిషన్, అనేదానిని, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం. కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం భారత తాజా జనాభా లెక్కలు ప్రకారం వివిధ శాసనసభల, లోక్‌సభల నియోజకవర్గాల సరిహద్దుల పునఃరూపకల్పన చేయడం ఈ ప్రక్రియ సమయంలో ప్రతి రాష్ట్రం నుండి ఇంతకు ముందు ఉన్న ప్రాతినిధ్యం మార్చబడదు.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
లియొనార్డో డా విన్సీ (ఆంగ్లం: Leonardo Da Vinci) (ఏప్రిల్ 15, 1452 – మే 2, 1519) ఇటలీకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్టు, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత. రినైజెన్స్ శైలిలో ఇతడు చిత్రీకరించిన మోనా లీసా, ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డా విన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చాయి.
కోర్ట్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేసి, సినిమాను మార్చి 14న విడుదల చేశారు.
ఎన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మన దేశం (1949) 1962వ సం చిత్రం శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ ను చేర్చలేదు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. దాసరి నారాయణరావు సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. "నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా" అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాదు లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 01 ఎప్రిల్ 1957లో స్థాపించబడింది. ఆదిలాబాద్ పట్టణంలోని సాంతినగర్ కాలనీలో ఉంది. జాతీయ స్థాయిలో న్యాక్ ద్వారా 'బి' గ్రేడ్ సాధించింది.ఇది ప్రస్తుతం 16 ఎకరాల విస్తీర్ణంలో నడబడుతుంది.