The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సంత్ సేవాలాల్ దీక్ష తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలంలోని కొత్తపల్లి - హెచ్, లో సంత్ సేవాలాల్ మహరాజ్ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ మహాశివరాత్రి రోజున 1992లో కొత్తపల్లి దీక్షభూమిలో సేవాలాల్ దీక్ష ను ప్రారంభించారు.ఈ 41 రోజుల సేవాలాల్ దీక్ష మహాశివరాత్రి పర్వదినాన్న ప్రారంభమై శ్రీరామనవమి రోజున ముగిస్తుంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది.
షడ్రుచులు అనగా ఆరు రుచులు. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) మానవ అంగిలి ద్వారా సాధారణంగా గుర్తించబడిన ఆరు ప్రాథమిక రుచులు ఉన్నాయి అవి: తీపి, పులుపు, లవణం, చేదు, వగరు, కారం. ప్రతి రుచికి సంక్షిప్త వివరణ ఈ క్రింద ఇవ్వబడింది: తీపి: తీపి తరచుగా చక్కెర లేదా తేనె రుచితో ముడిపడి ఉంటుంది.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
కిరిబాటి (/ˈkɪrɪbæs/ ⓘ కిర్ర్- ఇ-బాస,[] గిల్బర్టీస్: [కిరిబాస్]), అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి (గిల్బర్టీస్: రిబాబరికి కిరిబాటి), మైక్రోనేషియాలోని సెంట్రల్ సబ్సియన్లోని ఓషియానిరియాలోని ఒక ద్వీప దేశం. 2020 జనాభా లెక్కల ప్రకారం దీని శాశ్వత జనాభా 119,000 కంటే అధికం. వీరిలో సగానికి పైగా తారావా అటోల్లో నివసిస్తున్నారు.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 - డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
ఔరంగజేబు (ఫార్సీ: اورنگزیب (పూర్తి బిరుదు అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖన్ అల్-ముకర్రమ్ అబ్దుల్ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబ్ బహాదుర్ ఆలంగీర్ 1, పాదుషా గాజి) ) ఔరంగజేబు ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. ఈ ఆరవ మొఘల్ చక్రవర్తి భారత దేశాన్ని ఏలినవాళ్ళందిరిలోకీ కూడా అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు (ఫారసీ పేరుకు అర్థం: సింహాసనానికి వన్నె తెచ్చిన వాడు) కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది.
బొమ్మగాని ధర్మబిక్షం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు. అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10, 11వ లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. అతను నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండలం, ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో జన్మించారు.
డేవిడ్ ఆండ్రూ వార్నర్ (జననం 1986 అక్టోబరు 27) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరు. వార్నర్ 132 సంవత్సరాలలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అనుభవం లేకుండా ఏ ఫార్మాట్లోనైనా జాతీయ జట్టుకు ఎంపికైన మొట్ట మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్.
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
విరూపాక్ష 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుదల చేయగా, సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 21న విడుదలైంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.