The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
షడ్రుచులు అనగా ఆరు రుచులు. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) మానవ అంగిలి ద్వారా సాధారణంగా గుర్తించబడిన ఆరు ప్రాథమిక రుచులు ఉన్నాయి అవి: తీపి, పులుపు, లవణం, చేదు, వగరు, కారం. ప్రతి రుచికి సంక్షిప్త వివరణ ఈ క్రింద ఇవ్వబడింది: తీపి: తీపి తరచుగా చక్కెర లేదా తేనె రుచితో ముడిపడి ఉంటుంది.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
నికోలస్ పూరన్ ( ; జననం 2 అక్టోబర్ 1995) ఒక ట్రినిడాడియన్ క్రికెటర్, అతను ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు, అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు అప్పుడప్పుడు కెప్టెన్‌గా ఉంటాడు. అతను వెస్ట్ ఇండియన్ డొమెస్టిక్ మ్యాచ్‌లలో ట్రినిడాడ్, టొబాగో తరపున, IPL లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కూడా ఆడతాడు. అతను సెప్టెంబర్ 2016లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
మ్యాడ్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.
మనోజ్ కుమార్ భారతిరాజ ( 1976 సెప్టెంబర్ 11- 2025 మార్చి 25) మనోజ్ భారతిరాజా తమిళ సినిమా నటుడు దర్శకుడు . మనోజ్ భారతి రాజా ప్రముఖ దర్శకుడు భారతి రాజా కుమారుడు. మనోజ్ 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు మనోజ్ భారతి రాజా నటించిన సినిమాలలో సముద్రం (2001), కడల్ పూక్కల్ (2001) అల్లీ అర్జున (2002), వరుశమెల్లం వసంతం (2002) ఈరా నీలం (2003), అన్నకోడి (2013), బేబీ (2015), మానాడు (2021), విరుమన్ (2022) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి.
టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
వేపాడ చిరంజీవిరావు, శాసన మండలి సభ్యులు, ప్రముఖ విద్యావేత్త, రచయిత, అర్ధ శాస్త్ర అధ్యాపకుడు. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసి విజయం పొందాడు. చిరంజీవిరావు స్వగ్రామం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోగల రావికమతం మండలం, దొండపూడి గ్రామం .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అనేది ఆంధ్రప్రదేశ్ ద్విసభ శాసనసభ దిగువ సభ. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు. ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.వారు మొదటి-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో వయోజన సార్వత్రిక ఓటుహక్కు ద్వారా ఎన్నుకుంటారు.శాసనసభ ఏదేని పరిస్థితులలో త్వరగా రద్దుచేస్తే తప్ప మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి అసెంబ్లీ లేదా శాసనసభ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు.