The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
షడ్రుచులు అనగా ఆరు రుచులు. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) మానవ అంగిలి ద్వారా సాధారణంగా గుర్తించబడిన ఆరు ప్రాథమిక రుచులు ఉన్నాయి అవి: తీపి, పులుపు, లవణం, చేదు, వగరు, కారం. ప్రతి రుచికి సంక్షిప్త వివరణ ఈ క్రింద ఇవ్వబడింది: తీపి: తీపి తరచుగా చక్కెర లేదా తేనె రుచితో ముడిపడి ఉంటుంది.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో 1925వ సంవత్సరంలో స్థాపించారు. స్వామి వివేకానంద, అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్.
ఈద్-ఉల్-ఫితర్ (అరబ్బీ: عيد الفطر) అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు.
పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాదియైన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్త, సిద్ధాంతి, జ్యోతిష్కులు వంటివారెవరైనా చదివి, వ్యాఖ్యానించి, శుభాశుభ ఫలాలు వివరించి వినిపిస్తారు.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
మ్యాడ్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
జేమీ ఓవర్టన్ (జననం 10 ఏప్రిల్ 1994) సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడే ఇంగ్లీష్ క్రికెటర్. ఆయన కుడిచేతి ఫాస్ట్ బౌలర్, కుడిచేతి బ్యాటింగ్ చేస్తాడు. ఓవర్టన్ 2012లో సర్రేతో జరిగిన క్లైడెస్‌డేల్ బ్యాంక్ 40లో సోమర్సెట్ తరపున అరంగేట్రం చేసి జూన్ 2022లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
పోక్సో చట్టం (POCSO Act) అనేది లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం. బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offenses Act, 2011) ని 2012 మే 22న భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, 2012గా 2012 నవంబరు 14 నుండి అమలులోకి వచ్చింది. భారతదేశంలోని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని ఆమోదించింది.