The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
సరస్వతి పుష్కరాలు -2025 తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ మండలం, కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. బృహస్పతి మిథునరాశి లోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజులు పాటు ఆచరిస్తారు. ఇచ్చట గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
మహారాణి అహల్యా బాయి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు.అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)
వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రం, రాజన్న జిల్లా లోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 162 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది.
మావూళ్ళో మహాశివుడు 1979లో విడుదలైన తెలుగు సినిమా. గీతా సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దాసరి సత్యనారాయణ మూర్తి, వేగి వీరరాజు లు నిర్మించిన ఈ చిత్రానికి రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, సుభాషిని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నల్లగొండ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, డిసెంబర్ 07న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
శ్రీ హనుమంతుని జన్మస్థళము- పంపాక్షేత్ర "కిష్కింధా'' హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు అరుదు.
ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
ధరణి Archived 2023-07-11 at the Wayback Machine సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రములో ఉన్న వ్యవసాయ , వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్ . ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం.
శుభం 2025లో విడుదలైన తెలుగు సినిమా. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్, కనకవల్లి టాకీస్ బ్యానర్‌పై సమంత నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 31న, ట్రైలర్‌ను ఏప్రిల్ 27న విడుదల చేయగా, సినిమా మే 9న విడుదల చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 - ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది.
సారంగపాణి జాతకం 2025, ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమా. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేశ్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 21న నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయగా, డిసెంబరు 20న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.