The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మహారాణి అహల్యా బాయి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు.అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, గుప్త రాజవంశం) గుప్త వంశపు రాజులచే సుమారు సా.శ.280 నుండి సా.శ.550 వరకు పాలించబడింది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీపుత్ర (ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా) వీరి రాజధానిగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరు 30న జరిగాయి. ఓట్లు లెక్కింపు 2023 డిసెంబరు 03న జరిగింది.ఎన్నికల సంఘం ఫలితాలు అదేరోజు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, సీపీఐ-1 ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (ఆంగ్లం: World No-Tobacco Day) మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ఈశాన్య భారతదేశం, (ఇంగ్లీషులో నార్త్ ఈస్టర్న్ రీజియన్ - NER ) భారతదేశపు తూర్పు కొసన ఉన్న భౌగోళిక రాజకీయ పరిపాలనా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎనిమిది రాష్ట్రాలున్నాయి - అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర (ఈ ఏడింటిని "సెవెన్ సిస్టర్స్" అంటారు). ఎనిమిదవది "సోదర" రాష్ట్రం సిక్కిం.
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (దీనిని ఐపీఎల్ 2024 లేదా ఐపీఎల్ 18 అని కూడా పిలుస్తారు) ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 18వ సీజన్. ఐపీఎల్ 2025 మార్చి 14న మొదలై మే 25న ముగుస్తుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ మే 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2025 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.
బుడ్డా వెంగళరెడ్డి (జనవరి 1, 1840 - డిసెంబరు 31, 1900) 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. ఇతను కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులను జన్మించాడు. ఇతడు పెద్దగా చదవకపోయినా తల్లినుండి దానగుణాన్ని దాని గొప్పదనాన్ని తెలుసుకున్నాడు.
జస్ప్రీత్ జస్బీర్సింగ్ బుమ్రా (జననం 1993 డిసెంబరు 6) అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు తరఫున ఆడే అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్‌తో ఉండే కుడిచేతి ఫాస్ట్ బౌలరైన బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్లో గుజరాత్ తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపునా ఆడతాడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
ఫ్రెంచి పాలినేషియా అంతర్జాతీయ సేకరణ ఓవర్సీసు దేశం. ఇది భౌగోళికంగా చెల్లాచెదురుగా ఉన్న 121 ద్వీపాలు, అటోలులను కలిగి ఉంది.దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 2000 కిమీ కంటే ఎక్కువ(1200 మైళ్ళు) విస్తరించి ఉంది. ఫ్రెంచి పాలినేషియా మొత్తం భూభాగం వైశాల్యం 3521 చదరపు కిలోమీటర్లు (1359 చదరపు మైళ్ళు) 2,78,786 జనాభాతో (2022 ఆగస్టు జనాభా లెక్కలు) ఇందులో కనీసం 2,05,000 మంది సొసైటీ దీవులలో నివసిస్తున్నారు.
షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాకిస్థాన్ ముస్లిం లీగ్ -నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీ తరఫున జాతీయ అసెంబ్లీలో 2018 ఆగస్టు 20 నుండి 2022 ఏప్రిల్ 10 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్ (జననం 2001 డిసెంబరు 28) భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెటర్. ఆయన జూలై 2023 వెస్టిండీస్ లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు, టెస్ట్ క్రికెట్ లో తన మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు. ఆయన దేశీయ క్రికెట్లో ముంబై తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడతాడు.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
హిట్: ది థర్డ్ కేస్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 ఫిబ్రవరి 24న, ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను 2025 మే 1న విడుదల చేశారు.
రెట్రో (సబ్‌టైటిల్ లవ్-లాఫ్టర్-వార్) కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వం వహించిన భారతీయ తమిళ భాషా రొమాంటిక్ యాక్షన్ చిత్రం. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్య మరియు పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. రెట్రో ప్రపంచవ్యాప్తంగా 1 మే 2025న థియేటర్లలో స్టాండర్డ్ మరియు EPIQ ఫార్మాట్లలో విడుదలైంది.
భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 154 ప్రకారం, భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు దేశంలోగల 28 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. ఆ రాష్ట్ర అవసరాలను బట్టి రాష్ట్రపతి ఆమోదంతో ఈ పదవీకాలం పెంచవచ్చు. గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధిపతి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ద్వారా గవర్నరు తన పదోన్నతి ఉపయోగించగలరు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి
ఉత్తమ సహాయ నటికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారము (లేదా ఉత్తమ సహాయ నటికి రజత కమల పురస్కారం) 1984 నుండి సహాయపాత్రలలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటికి ఇస్తున్నారు. ఈ అవార్డు క్రింద వెండి కమలం, ప్రశంసాపత్రము, 50 వేల రూపాయల నగదు బహూకరిస్తారు. ఇంతవరకు ఈ విభాగంలో 33 పురస్కారాలు, 31మంది నటీమణులకు 9 భాషలలో ప్రదానం చేశారు.