The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తమ్ముడు 2025లో విడుదలైన ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరిట ప్రత్యేక వీడియోను మే 12న, ట్రైలర్‌ను జూన్ 11న విడుదల చేసి, సినిమాను జూలై 4న విడుదల చేయనున్నారు.
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 2021లో విడుదలైంది తెలుగు సినిమా. 2019లో మలయాళంలో విడుదలైన 'వికృతి' చిత్రాన్ని తెలుగులో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్ నిర్మించారు. ఆలీ, నరేష్, పవిత్ర లోకేష్, మౌర్యాని, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న ఆహా ఓటీటీలో విడుదలైంది.
శ్యాంప్రసాద్ ముఖర్జీ, (1901, జూలై 6) ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఓం నమో నారాయణాయ అనేది సంస్కృత మంత్రం, ఇది హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువుకు నివాళులర్పించే మార్గంగా హిందూ మతంలో తరచుగా ఉపయోగించబడుతుంది. మంత్రం సాధారణంగా "నేను నారాయణుడికి నమస్కరిస్తున్నాను" లేదా "నా నారాయణుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను" అని అర్థం. ఈ మంత్రాన్ని పఠించడం హిందూ మతంలో విశ్వం యొక్క రక్షకుడిగా పరిగణించబడే విష్ణువు యొక్క ఆశీర్వాదాలను కోరడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ లో దళితుల హక్కుల, సాధికారిత కోసము ఏర్పడిన సంఘము. ఎస్సీ రిజర్వేషన్లను కూడా బీసీ రిజర్వేషన్ల తరహాలో ఎ,బి,సి,డిలుగా వర్గీకరించి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఉన్న రిజర్వేషన్లను వాటికి పంచి కేటాయింపులు చేయాలన్నది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్. ఈ డిమాండ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రధానాశయం.
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
కుబేరా 2025లో విడుదలైన భారతీయ డ్రామా చిత్రం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ లోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఏకకాలంలో తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, జిమ్ సర్బ్, రష్మిక మందన్న, దలీప్ తహిల్ తదితరులు నటించారు.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ (జననం భావరాజు వేంకట పట్టాభిరామ్; మరణం 2025 జూన్ 30), రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. అతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేసాడు. అతను విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహిస్తున్నారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేయనున్నారు.