The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
టంగుటూరి ప్రకాశం పంతులు (1872 ఆగష్టు 23 – 1957 మే 20) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్ఎల్వి ఎమ్కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17 ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.
చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 2023 ఆగస్టు 23 న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్ ను, రోవర్ ను చంద్రుని పై విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా ఒక మైలురాయిను చేరుకుంది. ఈ విజయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోదీ, ఆగస్టు 23 ను భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్ణయించాడు.
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
పాశంవారి వెంకట రామారెడ్డి (1869, ఆగష్టు 22 - 1953, జనవరి 25) నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. నిజాం ప్రభువుకు విశ్వాసపాత్రులై, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి వారి శ్రేయస్సే ప్రధానంగా సేవచేసి అపారమైన వారి ప్రేమాభిమానలను చూరగొన్న ప్రజాబంధువు. నిజాం రాజుల ఏడు తరాల రాజ్యపాలనలో హైదరాబాదు నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితులైన మొదటి హిందువు.
సార్ మేడమ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 10న, ట్రైలర్‌ను జులై 17న విడుదల చేయగా, తమిళంలో తలైవన్ తలైవి పేరుతో జూలై 25న, తెలుగులో సార్ మేడమ్ పేరుతో ఆగష్టు 1న సినిమాను విడుదల చేశారు.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.