The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తమ్ముడు 2025లో విడుదలైన ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరిట ప్రత్యేక వీడియోను మే 12న, ట్రైలర్‌ను జూన్ 11న విడుదల చేసి, సినిమాను జూలై 4న విడుదల చేశారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
కింగ్డమ్ 2025లో రూపొందుతున్న తెలుగు సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఎన్.టి.ఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఫిబ్రవరి 12న విడుదల చేసి సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సివుండగా దేశంలో ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్స్ చేయడం, ఈవెంట్స్ నిర్వహించడం కష్టమని భావించి వయవాడ్ వేసి జూలై 4న సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలపగా, తిరిగి వాయిదా పడి చివరిగా జులై 31న విడుదలైంది.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సప్తమి గౌడ (జననం 1996 జూన్ 8) భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటిస్తుంది. 2023లో అభిషేక్ అంబరీష్ కథానాయకుడిగా సెట్స్‌పైకి వెళ్తున్న ప్రేమ కథాచిత్రం కాళిలో నాయికగా ఆమె ఎంపిక అయింది. అలాగే ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా ఆమెనటించనుంది.
భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మాలపల్లి గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో "సారధి ఫిలిమ్స్ " నిర్మాణంలో గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటించిన 1938 నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం. గుడిపాటి వెంకటచలం రాసిన అముద్రిత నవల మాలపిల్ల సినిమాకు ఆధారం. మాటలు, కొన్ని పాటలు తాపీ ధర్మారావు నాయుడు రాయగా, మిగిలిన పాటలు అప్పటికే ప్రచారంలో ఉన్న బసవరాజు అప్పారావు గేయాలు, జయదేవుని అష్టపదుల నుంచి తీసుకున్నారు.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
లైంగిక విద్య (ఆంగ్లం: Sex Education) అనగా మానవ లైంగికత (మానవ లైంగిక శరీరనిర్మాణశాస్త్రముతో సహా), లైంగిక పునరుత్పత్తి, సంభోగము, పునరుత్పత్తి ఆరోగ్యం, భావోద్రేక సంబంధాలు, పునరుత్పత్తి హక్కులు, విధులు, లైంగిక సన్యాసం, కుటుంబ నియంత్రణల గురించి తెలిపే విధివిధానాలు. తద్వారా లైంగిక వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తవహించాలో కూడా అర్ధం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. 2016లో విడుదలైన తమిళ్ సినిమా ‘తేరి’ ఆధారంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.