The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17 ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్ ప్రబాస్ తో బుజ్జిగాడు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
రాము రాథోడ్ (Ramu Rathod) తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లా కి చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు .జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తన కంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వెళ్ళి రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. రాము రాథోడ్ 2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారత ప్రభుత్వంలో రాష్ట్రపతి తర్వాత రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి భారత ఉపరాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 63ప్రకారం, రాజీనామా, తొలగింపు, మరణం, అభిశంసన లేదా రాష్ట్రపతి తమ విధులను నిర్వర్తించడంలో అసమర్థత కారణంగా ఆకస్మిక పరిస్థితి తలెత్తినప్పుడు ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తారు. వారు భారత పార్లమెంటు ఎగువ సభగా పిలువబడే రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆసియా ఖండమునకు చెందిన దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా, దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలను నివారణకోసం ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2003వ సంవత్సరం నుండి ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది.
2025 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
ఆరోగ్య సమస్యల కారణంగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తరువాత 2025 సెప్టెంబరు 9న భారతదేశంలో ముందస్తు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని 2వ నిబంధన ప్రకారం, ఉపరాష్ట్రపతి మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలు ఖాళీ అయిన తర్వాత "వీలైనంత త్వరగా" నిర్వహించబడుతాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్ అనే సినిమా రీమేక్.దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, శోభన, జగ్గయ్య,చంద్రమోహన్ , మున్నగు వారు నటించిన ఈ సూపర్ హిట్ చిత్రానికీ సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.
హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.
సుందరకాండ 2025లో విడుదలైన తెలుగు సినిమా. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 26న విడుదల చేశారు.
మార్గరెట్ హిల్డా థాచర్ (1925 అక్టోబరు 13 - 2013 ఏప్రిల్ 8) 1979 నుంచి 1990 వరకు యునైటెడ్ కింగ్డమ్కు ప్రధాన మంత్రిగా వ్యవహరించిన బ్రిటిష్ రాజకీయవేత్త. ఆ పదవిని నిర్వహించిన ఏకైక మహిళగానే కాకుండా దీర్ఘకాలం నిర్వహించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందింది. వ్యక్తిగత, రాజకీయ కఠినత్వం వల్ల ఆమె ఉక్కు మహిళ(ఐరన్ లేడీ)గా పేరు గడించింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
లోకా: ఛాప్టర్ 1 - చంద్ర డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన, దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ క్రింద నిర్మించిన 2025లో రాబోయే భారతీయ మలయాళ భాషా సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ తన మొదటి సూపర్ హీరో పాత్రలో, నస్లెన్ ప్రధాన పాత్రలో నటించారు. అరుణ్ కురియన్, చందు సలీమ్ కుమార్, నిశాంత్ సాగర్, రఘునాథ్ పలేరి, విజయరాఘవన్, నిత్యశ్రీ, శరత్ సభ తదితరులు ఇందులో నటించారు.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
సంభోగ సమయములో స్త్రీ పురుషుల శరీరములు (యోని పురుషాంగముతోసహా) పరస్పర సక్తములై ఉండే స్థితి భేదములనే ' సంభోగాసనములు, బంధములు, కరణములు ' మొదలగు పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. భిన్నజాతి స్త్రీపురుషులు కలిసినపుడు బాధారహితంగా సుఖించుటకు, సమానజాతి స్త్రీపురుషుల రతియందు నవ్యతను కల్పించుట శాస్త్రములయం దీ కరణభేదములు (బంధభేదములు) చెప్పబడ్డాయి. రతివేళ స్త్రీయొక్క శరీరస్థితి ననుసరించి ఈ ఆసన భేదములు ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
భారత ప్రధాన మంత్రి, భారత ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా, కేంద్రమంత్రుల మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ, నామమాత్ర, ఉత్సవ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, ఆచరణలో సాధారణంగా, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి, వారు ఎన్నుకున్న మంత్రుల మండలికే ఉంటుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శాసనమండలి అయిన లోక్‌సభ, భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు.