The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మిరాయ్ 2025లో విడుదలైన తెలుగు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 28న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి, సినిమాను 8 భాషల్లో సెప్టెంబర్ 12న విడుదల చేశారు.
కిష్కింధపురి 2025లో తెలుగులో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశ్‌పాండే, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 15న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేశారు.
హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.
రవికె లేదాచోలీ (తమిళం: ரவிகே, కన్నడ: ರವಿಕೆ, హిందీ: चोली, మరాఠీ: चोळी, ఆంగ్లం: Blouse లేదా జాకెట్టు ) భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దక్షిణ నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్,, చీరలు ధరించే ఇతర ప్రదేశాలలో ధరిస్తారు. దీని మీద చీర యొక్క పైట భాగం కప్పుతుంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
భారతదేశంలో ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి, 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు.
స్నిగ్ధత అంటే viscosity విరూప బలాల ప్రబల్యంవల్ల ఘన పదార్ధాల ఆకారం మారుతుంది. అయినా అంతరిక బలాలు బాహ్య బలాలను నిరోధిస్తాయి.బాహ్యబలం పని చేయడం మానిన వెంటనే సామాన్యంగా వాటి కున్న ఆకారాన్ని తిరిగి పొందగలవు.కాని ద్రవ పదార్ధాలుα, వాయుపదార్ధాలు విరూప బలం ఎంత అల్పమైనా దాని ప్రాబల్యం ప్రవహిస్తాయేగాని ఆ బలాన్ని నిరేధించి నిలువలేవు. ఇది చలనంలో లేని ప్రవాహాలకే వర్తిస్తుంది.అంటే సాంఖ్యాక పరిస్థితులలో మాత్రమే ప్రవాహులలో విరూపణ ప్రతి బలాలు ఉండవన్న మాట.కాని సమాతాస్థితి పొందే ముందు అంటే ప్రవాహికదులుతున్నంత కాలం ప్రవాహులలో విరూపణ బలాలు ఉండవచ్చు.చలనంలో ఉన్న ప్రవాహులలో ఉండే అటువంటి విరూపణ బలాలను సూచిస్తుంది.
రాము రాథోడ్ (Ramu Rathod) తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లా కి చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు .జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తన కంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వెళ్ళి రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. రాము రాథోడ్ 2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. 2016లో విడుదలైన తమిళ్ సినిమా ‘తేరి’ ఆధారంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
శుభం 2025లో విడుదలైన తెలుగు సినిమా. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్, కనకవల్లి టాకీస్ బ్యానర్‌పై సమంత నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 31న, ట్రైలర్‌ను ఏప్రిల్ 27న విడుదల చేయగా, సినిమా మే 9న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్ ప్రబాస్ తో బుజ్జిగాడు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1883 సెప్టెంబరు 14 - 1960 ఫిబ్రవరి 29) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం ఎడిటరుకు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17 ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.
పరదా 2025లో విడుదలైన సినిమా. శ్రీమతి భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 22న, ట్రైలర్‌ను ఆగష్టు 9న విడుదల చేసి, సినిమాను ఆగస్టు 22న విడుదల చేశారు.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
తంత్ర 2024లో విడుదలైన హారర్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో టీజర్‌ను డిసెంబర్ 8న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేసి, సినిమాను మార్చి 15న విడుదల చేశారు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
సుందరకాండ 2025లో విడుదలైన తెలుగు సినిమా. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 26న విడుదల చేశారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.