The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కిష్కింధపురి 2025లో తెలుగులో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశ్‌పాండే, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 15న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేశారు.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
తమ్ముడు 2025లో విడుదలైన ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరిట ప్రత్యేక వీడియోను మే 12న, ట్రైలర్‌ను జూన్ 11న విడుదల చేసి, సినిమాను జూలై 4న విడుదల చేశారు.
మిరాయ్ 2025లో 1విడుదలైన తెలుగు ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 28న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి, సినిమాను 8 భాషల్లో సెప్టెంబర్ 12న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రాము రాథోడ్ (Ramu Rathod) తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లా కి చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు .జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తన కంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వెళ్ళి రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. రాము రాథోడ్ 2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
బకాసుర రెస్టారెంట్ 2025లో విడుదలైన సినిమా. ఎస్జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ సినిమాకు ఎస్జే శివ దర్శకత్వం వహించాడు. ప్రవీణ్, హర్ష చెముడు, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ట్రైలర్‌ను మే 16న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 8న విడుదల చేశారు.
శివుని ఆరాధించే వారు శైవులు , విష్ణువును ఆరాధించేవారిని వైష్ణవులు , ఆదిశక్తి ని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారిని శాక్తేయులు అంటారు.శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత పొలిమేరమ్మ.మసూచి,ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనటం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందమోపటమే అవుతుంది.సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తి పోలేరమ్మఅంటారు.పోలేరమ్మను తెలంగాణాలో పోచమ్మ అంటారు.మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు.బహుజన సంస్కృతి పరిరక్షకులు.సమాజంలోని బడుగుకులాలవారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతరల వల్ల సాధ్యమయ్యింది. వర్షాలు పడాలని పోలేరమ్మ తిరునాళ్లు, కొలుపులు చేస్తారు.పోలేరమ్మకు జంతు బలులు ఇస్తారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
మను స్మృతి ప్రకారం ఉపనయనం (ఒడుగు) జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కాని, నిత్య కర్మలు (పితృ సంస్కారాలతో సహా) అనుష్ఠానం చేసే అవకాశం గాని లేదు. బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు, భట్ట రాజులు గర్భధారణతో కలిపి 11 ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది. యజ్ఞోపవీతాన్ని వాడుకలో జందెం, జందియం, జంద్యం అని కూడా అంటారు.
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
థాయిలాండ్ లేదా థాయ్‌లాండ్ (English: Thailand నించి, Thai: ประเทศ, translit. [ప్రాటెట్ థాయ్] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: ప) (help) "ప్రదేశ థాయి"), అధికారికంగా థాయి రాజ్యం (ราชอาณาจักรไทย రచ్చ అన్న చక్ర థాయ్ "రాజా ఆజ్ఞ చక్ర థాయి"; Kingdom of Thailand కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్), ఒక ఆగ్నేయ ఆసియా దేశము. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది.
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా, సినిమా జూన్ 20న విడుదలైంది.
కన్యాకుమారి (2025 తెలుగు సినిమా)
కన్యాకుమారి 2025లో విడుదలైన తెలుగు సినిమా. మధుశాలిని సమర్పణలో ఎ రాడికల్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ నిర్మించి దర్శకత్వం వహించాడు. గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 20న విడుదల చేయగా, సినిమాను ఆగష్టు 27న విడుదల చేశారు.
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.