The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన లలితా దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.లలితా దేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత లలితా దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ‘హంగ్రీ చీతా’ పేరుతో సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి & మాజీ క్రికెట్ క్రీడాకారుడు. సీవీ ఆనంద్ 2021 డిసెంబరు 24 నుండి 2023 అక్టోబరు 12 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు. ఆయన 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నాడు.
ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకునే హిందూ పండుగ. ఇది సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో, నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున వస్తుంది. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడిన రోజు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సంజనా గల్రానీ (ఆంగ్లం: Sanjjanaa Galrani) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో సోగ్గాడు అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది. ముగ్గురు, యమహో యమః, లవ్ యు బంగారమ్, సర్దార్ గబ్బర్ సింగ్, బుజ్జిగాడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
రాము రాథోడ్ (Ramu Rathod) తెలంగాణ రాష్ట్రం , మహబూబ్‌నగర్ జిల్లా కి చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు .జానపద కళలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆధునీకరించడాని కృషి చేస్తున్నాడు. తన కంటు ఒక ప్రత్యేక శైలిని సృష్టించి యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ట్రెండింగ్ లోకి వెళ్ళి రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. రాము రాథోడ్ 2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
ఘాటి 2025లో విడుదలైన సినిమా. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణ, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్లింప్స్‌ని అనుష్క పుట్టినరోజు సందర్బంగా 2024 నవంబర్ 7న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా మొదట ఏప్రిల్ 18న విడుదల చేయాలని నిర్మాతలు ప్రకటించగా, షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల కాలేకపోయింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేతలలో ఒకరైన విజయ్‌కుమార్ మల్హోత్రా (Vijay Kumar Malhotra) 1931, డిసెంబర్ 3న లాహోర్‌లో జన్మించాడు. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందిన మల్హోత్రా హిందీలోనూ, ఆంగ్లంలోనూ పలు రచనలు చేశాడు. 1958లో ఢిల్లీ కార్పోరేషన్ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్హోత్రాకు నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగానూ, ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడుగానే కాకుండా అనేక పార్లమెంటరీ కమిటీలలో పనిచేసిన అనుభవం ఉంది.