The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న, టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
'వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 28 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం(రంపచోడవరం),అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆసియా ఖండమునకు చెందిన దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా, దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
'డోనాల్డ్ జాన్ ట్రంప్ (1946 జననం జూన్ 14) ఒక అమెరికను రాజకీయ నాయకుడు, మీడియా వ్యక్తి, వ్యాపారవేత్త, ఆయన 47వ యునైటెడు స్టేట్సు అధ్యక్షుడు.రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఆయన 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడిగా పనిచేశాడు. న్యూయార్కు నగరంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ట్రంపు 1968లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలరు డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. 1971లో ఆయన తన కుటుంబ రియలు ఎస్టేటు వ్యాపారానికి అధినేత అయ్యాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల జాబితా
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సంస్థపై అధ్యక్షుడుకు అత్యున్నత అధికారం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించడం, దాని యువజన విభాగం, రైతు విభాగం వంటి వాటికి వివిధ హోదాలలో వ్యక్తులను నియమించే అధికారం పార్టీ అధ్యక్షుడు కలిగి ఉంటాడు.
గబ్బిలం కవి గుర్రం జాషువా పద్య రచన. ఇందులో జాషువా సామాన్య ప్రజానీకం అశుభంగా భావించే గబ్బిలాన్ని దళిత జనుల అందరి తరపున వారి భాధలను వివరించడానికి శివుడి దగ్గరకు దూతగా పంపిస్తాడు. ఈ గబ్బిలం తమిళనాడులోని తంజావూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలమీదుగా, ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను దాటుకుంటూ కాశీలో ఉన్న శివుడి దగ్గరకు వెళుతుంది.