The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
' వెనుజ్వేలా, దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " వెనుజ్వేలా బోలివారియ గణతంత్రం " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది.
శంబాల 2025లో విడుదలైన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న, ట్రైలర్‌ను నవంబర్ 1న నటుడు ప్రభాస్ విడుదల చేయగా, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
భగవంత్ కేసరి 2023లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2023 జూన్ 10న చిత్ర యూనిట్ విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మానవుడు - దానవుడు (1972 సినిమా)
మానవుడు దానవుడు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో ఉషశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.చిన్నపరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1972, జూన్ 23న విడుదలయ్యింది. ఉప్పు శోభన్ బాబు, శారద, కృష్ణకుమారి, సత్యనారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం గుడిమెట్ల అశ్వద్ధామ అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 28 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం(రంపచోడవరం),అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
సైక్ సిద్ధార్థ 2026లో విడుదలకానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. స్పిరిట్ మీడియా, నందునెస్, కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శ్యామ్ సుందర్ రెడ్డి తుడి, శ్రీ నందు నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నందు, యామిని భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 8న, ట్రైలర్‌ను డిసెంబర్ 02న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 12న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వాళ్ళ వాయిదా పడి 2026 జనవరి 1న విడుదల కానుంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
నగర పాలక సంస్థలకు, పట్టణ పురపాలక సంఘాలకు ఎన్నికలు ముగిసిన తదుపరి, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ లేదా నగర మేయర్ అంటారు. అలాగే మరొకరిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని డిప్యూటీ మేయర్ అంటారు. మొదటి గ్రేడు హైదరాబాద్ , విశాఖపట్నం (గ్రేటరు హోదా కలిగిన) లాంటి నగరపాలక సంస్థకు ఎన్నుకొనబడిన బడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు లేదా నగర్ మేయరు అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకొనబడిన వ్యక్తిని పురపాలక అధ్యక్షుడు లేదా పట్టణ మేయర్ అని అంటారు.
మేడిపల్లి సత్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. మేడిపల్లి సత్యం ఉస్మానియా యూనివర్సిటీ నుండి రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2023లో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏకైక విద్యార్థి నాయకుడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
విశ్వామిత్రుడు హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. గాయత్రీ మంత్ర సృష్టి కర్తగా, శ్రీరామునకు గురువుగా, హరిశ్చంద్రుని పరీక్షించినవానిగా, త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవానిగా, శకుంతలకు తండ్రి అందువలన భరతునకు తాతగా గుర్తిస్తారు.
[[వర్గం:2026_హిందీ_సినిమాలు]] ఇక్కిస్ (Ikkis) అనేది 2026 జనవరి 1 న విడుదల అయిన ఒక భారతీయ హిందీ భాషా చలన చిత్రం. చిన్న వయసులోనే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ (Arun Khetarpal) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పేరు వీర మరణం పొందిన నాటికి అతని వయసును సూచించే విధంగా పెట్టారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దినేష్ విజన్, బిన్నీ పడ్డా నిర్మించారు.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.