The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మన శంకర వరప్రసాద్‌గారు 2025లో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
శంబాల 2025లో విడుదలైన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించాడు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న, ట్రైలర్‌ను నవంబర్ 1న నటుడు ప్రభాస్ విడుదల చేయగా, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది,మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించన సంస్థ.
పంచరత్న కృతులు త్యాగరాజు కర్ణాటాక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు.శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను పంచరత్న కృతులను "త్యాగరాజ పంచ రత్నాలు" అనడం కూడా కద్దు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి. ఈ వేలాది కీర్తనలలో 750 కీర్తనలు లభించుచున్నాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
' వెనుజ్వేలా (వెనిజులా), దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలో కరేబియన్ సముద్రంలోని ఒక తీర దేశం. దీన్ని అధికారికంగా " వెనుజ్వేలా బోలివారియ గణతంత్రం " అంటారు. ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజుగా ప్రసిద్ధి కెక్కిన ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు ఆంధ్ర సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 28 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం(రంపచోడవరం),అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకాండ, రాజా, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మొదలైనవి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.
స్టీఫెన్ విలియం హాకింగ్ (1942 జనవరి 8 - 2018 మార్చి 14) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు (విశ్వనిర్మాణ శాస్త్రవేత్త). మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చ్ సంస్థకి డైరెక్టరుగా ఉన్నాడు. ఈయనకు 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది.
పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.
దృశ్యం 2 2021లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల పై డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. దగ్గుబాటి వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 25 నవంబర్ 2021న విడుదలైంది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.
మాళవిక మోహన్ (ఆంగ్లం: Malavika Mohanan; జననం 1993 ఆగస్టు 04) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. మాళవిక మోహన్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
మగధ (సంస్కృతం: मगध ) ప్రాచీన భారతదేశానికి చెందిన పదహారు మహాజనపదాలలో ఒకటి. ఈ రాజ్యం బీహారు, గంగానదికి దక్షిణాన గల ప్రాంతాలలో వ్యాపించి యుండేది; దీని మొదటి రాజధాని రాజగృహ (నవీన రాజగిరి) తరువాత పాటలీపుత్ర (నవీన పాట్నా). మగధ సామ్రాజ్యం లిచ్ఛవి, అంగ సామ్రాజ్యాలను జయించడం వలన బీహార్ నుండి బెంగాల్ వరకూ, ఉత్తర ప్రదేశ్ వరకునూ వ్యాపించింది.
అక్కాడ్/అగాడే రాజ్యం అక్కాడియన్ సామ్రాజ్యానికి రాజధాని. అనేది ఒక పురాతన రాజ్యం, ఇది తరచుగా తెలిసిన మొదటి సామ్రాజ్యంగా పరిగణించబడుతుంది, [అక్కడ్]|అక్కడ్ (అక్కడ్) ( లేదా ) మరియు దాని పరిసర ప్రాంతం ఆధునిక ఇరాక్‌లో, సామ్రాజ్యం సెమిటిక్ అక్కాడియన్ మరియు సుమేరియన్ మాట్లాడేవారిని ఒకే పాలనలో ఏకం చేసింది మరియు మిష్ అంతటా గణనీయమైన ప్రభావాన్ని చూపింది, ఫ్రెడరిక్ సి., ఎడిటర్ ఇన్ చీఫ్, మెసొపొటేమియా, లెవాంట్, ఆధునిక ఇరాన్ మరియు అనటోలియా యొక్క ఎడిటర్ ఇన్ చీఫ్, దిల్మున్ మరియు మగన్ వరకు దక్షిణాన సైనిక దండయాత్రలను పంపాడు. "Akkad" Webster's Ninth New Collegiate Dictionary.
బెంగళూరు విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే
బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే, నిర్మాణంలో ఉన్న 518 km (322 mi) -పొడవైన, ఆరు-వరుసల యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే. ఇది కర్ణాటక రాజధాని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన విజయవాడ నగరాల మధ్య ఉంటుంది. దీన్ని దీనిని బెంగళూరు-కడప-విజయవాడ (BKV) ఎక్స్‌ప్రెస్‌వే అనీ, NH-544G అనీ కూడా అంటారు.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
భగవంత్ కేసరి 2023లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2023 జూన్ 10న చిత్ర యూనిట్ విడుదల చేశారు.