The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..
ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.
నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
గణేష్ ఆచార్య, భారతదేశానికి చెందిన సినిమా నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు. ఆయన కొరియోగ్రాఫర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా నటుడిగా, దర్శకుడిగా పని చేసి 65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. బాడీగార్డ్ (2011), సింగం (2011)తో సహా పలు చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించాడు.
ధ్రువ్ రాఠీ ( జననం: 1994 అక్టోబరు 8) ఒక భారతీయ యూట్యూబర్ వ్లాగర్, సోషల్ మీడియా కార్యకర్త. సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై తన యూట్యూబ్ వీడియోలకు అతను ప్రసిద్ధి చెందాడి. 2023 సెప్టెంబరు నాటికి అతను అన్ని ఛానెళ్లలో సుమారు 17.1 మిలియన్ల మంది చందాదారులను, మొత్తం 3.2 బిలియన్ వీడియో వీక్షణలను కలిగి ఉన్నాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి
తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (ఆగష్టు 5, 1897 - డిసెంబరు 10, 1990) గారు శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అమ్మ ఉపాసకులు.
విశ్వనాథ్ పాటేకర్ (1951 జనవరి 1 - 2026 అక్టోబరు 8), నానా పాటేకర్ గా సుపరిచితుడు, ప్రధానంగా హిందీ, మరాఠీ సినిమాలలో పనిచేసిన భారతీయ నటుడు, సినిమా నిర్మాత. భారతీయ సినిమాలో గొప్ప, అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా పరిగణించబడే పాటేకర్ తన నటనకు గాను మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, రెండు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (మరాఠీ) అందుకున్నాడు. సినిమా, కళలకు ఆయన చేసిన కృషికి గాను 2013లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయబడింది.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.
హనుమాన్ అంశ్ అనేది విశాల్ చతుర్వేది తన బ్యానర్ అయిన శంభు మీడియా నెట్‌వర్క్ కథ అందించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 2026 భారతీయ హిందీ భాషా చిత్రం. ఒక త్రయం మొదటి విడతగా వచ్చిన ఈ చిత్రం, నీమ్ కరోలి బాబా జీవితం ఇతివృత్తంగా ఆయన రాసిన "డివైన్ డిటోర్ః దట్ చేంజ్డ్ మై లైఫ్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో శోభినవ్ సత్య, చందన్ కె ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవాన్ దాస్ పటేల్, నేహా పరాంజపే తదితరులు నటించారు.మొదటి చిత్రం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో, దేవుడిని వెతుక్కుంటూ తన తల్లి మరణించిన తరువాత ఇంటి నుండి బయలుదేరిన చిన్న పిల్లవాడు లక్ష్మీ నారాయణ్ ప్రారంభ జీవితాన్ని, ఉత్తర భారతదేశం గుండా అతని తదుపరి ప్రయాణం, నీమ్ కరోలి బాబాగా రూపాంతరం చెందడాన్ని చిత్రీకరించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్‌వెల్ట్, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది.
దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన లలితా దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.లలితా దేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత లలితా దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.
అష్టదిక్కులు లేదా ఎనిమిది దిక్కులు అనగా ప్రాచీన భారతీయ సంప్రదాయంలో సూచించబడిన ప్రధానమైన ఎనిమిది భౌగోళిక దిశలు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా తూర్పు, పశ్చిమం (పడమర), ఉత్తర, దక్షిణ అనే నాలుగు ప్రధాన దిక్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కానీ, భారతీయ సంప్రదాయంలో ఈ నాలుగు ప్రధాన దిక్కులతో పాటుగా వాటి మధ్య ఉండే మరో నాలుగు ఉప దిక్కులకు (మూలలకు - ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం) కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
పూర్వం రాజుల కాలంలో రాజుని పొగడడానికి ఆనాడు రాజుల కొలుపులో ఉండేవారు.వీరు రాజు పక్కనే ఉంటూ రాజుని పొగుడుతూ ఉంటారు. ఉదయాన్నే సన్నాయి మేళాలతో చక్రవర్తి పొగుడుతూ మేల్కొలుపుతారు.వీరు వైశ్య పురుషుడికీ + క్షత్రియ స్త్రీ పుట్టిన సంతానం ఈ వందిమాగదులు.వీరి పని రాజులను పొగుడుతూ బతకడం వీరి ప్రధాన వృత్తి.వంది పూర్వ రోజుల గొప్పదనం చెప్పాడు. మాగది అప్పుడు పరిపాలిస్తున్న రాజును పొగుడుతూ ఉంటాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
అభిజీత్ దీప్కే (Abhijit Dipke) భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ డిజిటల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, సామాజిక-రాజకీయ కార్యకర్త. ఆయన దేశంలోని నిరుద్యోగ యువత సమస్యలు, విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన వ్యంగ్యాత్మక రాజకీయ ఉద్యమం "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP) ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.