The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
సింగీతం శ్రీనివాసరావు (1931 సెప్టెంబరు 21 - 2026 అక్టోబరు 3), ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించారు . మయూరి (1985), పుష్పక విమానం (1988), మైఖేల్ మదన్ కామరాజు (1990),ఆదిత్య 369 (1991) వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించారు .
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
ఏర్నెస్టో"చే" గువేరా (ఆంగ్లం: Che Guevara) (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. దాసరి నారాయణరావు సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. "నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా" అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
షాయ్ డియెగో హోప్ (జననం 1993 నవంబరు 10) బార్బడియన్ క్రికెటర్, ఆయన వెస్టిండీస్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడతాడు. ఆయన ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ జట్టు వన్డే & టి20ఐ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. షాయ్ హోప్ జూన్ 2018లో వార్షిక క్రికెట్ వెస్టిండీస్ అవార్డులలో పురుషుల మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
హనుమాన్ అంశ్ అనేది విశాల్ చతుర్వేది తన బ్యానర్ అయిన శంభు మీడియా నెట్‌వర్క్ కథ అందించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 2026 భారతీయ హిందీ భాషా చిత్రం. ఒక త్రయం మొదటి విడతగా వచ్చిన ఈ చిత్రం, నీమ్ కరోలి బాబా జీవితం ఇతివృత్తంగా ఆయన రాసిన "డివైన్ డిటోర్ః దట్ చేంజ్డ్ మై లైఫ్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో శోభినవ్ సత్య, చందన్ కె ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవాన్ దాస్ పటేల్, నేహా పరాంజపే తదితరులు నటించారు.మొదటి చిత్రం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో, దేవుడిని వెతుక్కుంటూ తన తల్లి మరణించిన తరువాత ఇంటి నుండి బయలుదేరిన చిన్న పిల్లవాడు లక్ష్మీ నారాయణ్ ప్రారంభ జీవితాన్ని, ఉత్తర భారతదేశం గుండా అతని తదుపరి ప్రయాణం, నీమ్ కరోలి బాబాగా రూపాంతరం చెందడాన్ని చిత్రీకరించింది.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ఎనుముల రేవంత్ రెడ్డి (జననం 8 నవంబర్ 1969) తెలంగాణ రెండవ & ప్రస్తుత ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్‌లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
లాల్ బహదూర్ శాస్త్రి ( ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన 1920లలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవాహర్ లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
ఆహారం (Food) జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి.
బ్రిటిష్ వలసవాద శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 "ప్రకృతి క్రమానికి వ్యతిరేకమైన" అన్ని లైంగిక చర్యలను నేరంగా పరిగణించింది. స్వలింగ సంపర్కంతో పాటు నోటి, అంగ సంపర్కంలో పాల్గొనే వ్యక్తులపై విచారణ జరిపేందుకు ఈ చట్టన్ని ఉపయోగించారు. ఈ శిక్షాస్మృతి బ్రీటీష్ ఆదీనంలో పూర్వం ఉన్న చాలా కాలనీలలో ఇంకా ఉంది, మయన్మార్‌లోని అప్విన్ట్ వంటి మూడవ లింగం వారిని నేరస్థులుగా పరిగణించడానికి ఉపయోగించబడుతుంది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
చతేశ్వర్ పుజారా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన బెంగళూరులో 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి 2023 ఫిబ్రవరి 17న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100వ టెస్టు ఆడి వంద టెస్టుల్లో ఆడిన 13వ భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లలో 43.60 సగటుతో 7,195 పరుగులు సాధించాడు.
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )
మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–ప్రస్తుతం) వ్యవహరిస్తున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా ఉన్నారు.