The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
విశ్వనాథ్ పాటేకర్ (1951 జనవరి 1 - 2026 అక్టోబరు 8), నానా పాటేకర్ గా సుపరిచితుడు, ప్రధానంగా హిందీ, మరాఠీ సినిమాలలో పనిచేసిన భారతీయ నటుడు, సినిమా నిర్మాత. భారతీయ సినిమాలో గొప్ప, అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా పరిగణించబడే పాటేకర్ తన నటనకు గాను మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, రెండు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (మరాఠీ) అందుకున్నాడు. సినిమా, కళలకు ఆయన చేసిన కృషికి గాను 2013లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయబడింది.
ధ్రువ్ రాఠీ ( జననం: 1994 అక్టోబరు 8) ఒక భారతీయ యూట్యూబర్ వ్లాగర్, సోషల్ మీడియా కార్యకర్త. సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై తన యూట్యూబ్ వీడియోలకు అతను ప్రసిద్ధి చెందాడి. 2023 సెప్టెంబరు నాటికి అతను అన్ని ఛానెళ్లలో సుమారు 17.1 మిలియన్ల మంది చందాదారులను, మొత్తం 3.2 బిలియన్ వీడియో వీక్షణలను కలిగి ఉన్నాడు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యా.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సింగీతం శ్రీనివాసరావు (1931 సెప్టెంబరు 21 - 2026 అక్టోబరు 3), ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించారు . మయూరి (1985), పుష్పక విమానం (1988), మైఖేల్ మదన్ కామరాజు (1990),ఆదిత్య 369 (1991) వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించారు .
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
హనుమాన్ అంశ్ అనేది విశాల్ చతుర్వేది తన బ్యానర్ అయిన శంభు మీడియా నెట్‌వర్క్ కథ అందించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 2026 భారతీయ హిందీ భాషా చిత్రం. ఒక త్రయం మొదటి విడతగా వచ్చిన ఈ చిత్రం, నీమ్ కరోలి బాబా జీవితం ఇతివృత్తంగా ఆయన రాసిన "డివైన్ డిటోర్ః దట్ చేంజ్డ్ మై లైఫ్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో శోభినవ్ సత్య, చందన్ కె ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవాన్ దాస్ పటేల్, నేహా పరాంజపే తదితరులు నటించారు.మొదటి చిత్రం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో, దేవుడిని వెతుక్కుంటూ తన తల్లి మరణించిన తరువాత ఇంటి నుండి బయలుదేరిన చిన్న పిల్లవాడు లక్ష్మీ నారాయణ్ ప్రారంభ జీవితాన్ని, ఉత్తర భారతదేశం గుండా అతని తదుపరి ప్రయాణం, నీమ్ కరోలి బాబాగా రూపాంతరం చెందడాన్ని చిత్రీకరించింది.
నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
భారత ప్రధాన ఎన్నికల కమిషనరు, అనే పదవి స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగిన భారత ఎన్నికల కమిషన్ (సిఇసి)కి నాయకత్వం వహించే ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి). భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు. అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత నగర మేయర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 నగరాలలో ఉన్న నగర పాలక సంస్థలకు (Municipal Corporations) మేయర్ అధిపతిగా ఉంటారు. నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అన్ని విధులు అధికారికంగా మేయర్ పేరుతోనే నిర్వహించబడతాయి. మేయర్‌ను నగరంలోని తొలి పౌరుడు (First Citizen)గా కూడా పరిగణిస్తారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
బహుజన సమాజ్ పార్టీ నిర్మాత. రామదాసియా శిక్కు చమార్ కులస్తులైన తేల్‌సింగ్, బిషన్‌సింగ్ కౌర్ లకు .మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్‌పూర్ గ్రామంలోజన్మించాడు.జ్యోతిరావ్ ఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్ ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
తెలుగు వికీపీడియా (తెవికీ) ఒక ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వం. 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియాలో ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అమెరికాలో ఉన్న వికీమీడియా ఫౌండేషను అనే స్వచ్ఛంద సంస్థ పలు భాషలలో నెలకొల్పిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి.
ఏర్నెస్టో"చే" గువేరా (ఆంగ్లం: Che Guevara) (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ప్రపంచ తపాలా దినోత్సవం (World Post Day - వరల్డ్ పోస్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపంగా అక్టోబరు 9 న జరుపుకుంటారు. స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, ఇది స్థాపించిబడిన అక్టోబరు 9 న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు రాయడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవం యొక్క ఆరంభం.