The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 - 1958 ఫిబ్రవరి 22) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు "మొహియుద్దీన్ అహ్మద్", 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2024 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు. అతను 2021 ఆగష్టు 10న పార్లమెంటులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అతను రెండవసారి 2022 జూన్ 22 నుండి వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అధికారంలో ఉన్నాడు.
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
పరివర్తన రాజనీతి పార్టీ (Parivarthana Rajaneethi Party – PRP) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీ. ఈ పార్టీని మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి 2026 నవంబరు 11న విజయవాడలో ప్రకటించారు. పార్టీ పేరు, జెండాను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
భాయ్ దూజ్, భాయ్ టికా, భౌబీజ్, భాయ్ బీజ్, భాయ్ ఫొంటా లేదా భ్రాత్రి ద్వితియా అనేది విక్రమ్ సంవత్ హిందూ క్యాలెండర్ లేదా శాలివాహన శక క్యాలెండర్ ఎనిమిదవ నెల అయినకార్తీక శుక్ల పక్షం (ప్రకాశవంతమైన పక్షం) రెండవ చాంద్రమాన రోజున హిందువులు జరుపుకునే పండుగ. దీనిని దీపావళి లేదా తీహార్ పండుగ, హోలీ పండుగ సమయంలో జరుపుకుంటారు. ఈ రోజు వేడుకలు రక్షా బంధన్ పండుగను పోలి ఉంటాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గంలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. భారతదేశంలో చారిత్రకంగా, రాజకీయంగా ప్రముఖమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ తను మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు నానమ్మ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ మరణించింది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు ఇప్పటివరకు ముగ్గురు భారతదేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టినారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (దీనిని ఐపీఎల్ 19, బ్రాండింగ్ పరంగా టాటా ఐపీఎల్ 2026 అని కూడా పిలుస్తారు) ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్. ఈ టోర్నమెంట్‌లో 10 జట్లు 13 వేదికలలో 74 మ్యాచ్‌లలో తలపడ్డాయి, ఇవి మార్చి 28 నుండి మే 31 వరకు జరిగాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
జెన్సన్ హువాంగ్ (ఆంగ్లం: Jensen Huang; జననం: 1963 ఫిబ్రవరి 17) ఒక తైవానీస్, అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన ఎన్విడియా (Nvidia Corporation)కు వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, సీఈఓ. 2026లో ఫోర్బ్స్ అతని నికర విలువను 200 బిలియన్ డాలర్లకు పైగా అంచనా వేసింది, దీంతో అతను ప్రపంచంలో ఏడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఘండీ దంపతుల పెద్ద కుమారుడు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
శని (शनि, Śani), లేదా శనైశ్చరుడు (Sanskrit: शनैश्चर, Śanaiścara) అనునది హిందూమతంలో శని గ్రహం దైవిక రూపం. హిందూ జ్యోతిషశాస్త్రంలోని తొమ్మిది ఖగోళ వస్తువులలో (నవగ్రహాలు) ఒకరు. పురాణాలలో శని నల్లని రంగులో ఉండి కత్తి లేదా దండం పట్టుకుని దున్నపోతు లేదా కొన్నిసార్లు కాకిపై కూర్చున్నట్లుగా వర్ణించబడిన పురుష హిందూ దేవత.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.