The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలులో ఉన్నదేవాలయం.ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిపొందిన దేవాలయాలలో ఇది ఒకటి.ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ తిరుపతాంబ "శక్తి" ప్రతిరూపంగా పూజింపబడుతోంది.
భారత కేంద్ర బడ్జెట్ 2025, అనేది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్. ఆమె భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ వరసగా అత్యధిక సార్లు (ఎనిమిదో సారి) బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా, మహిళ మంత్రిగా నిలిచింది. అంతకుముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు సృష్టించాడు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా (జననం: 2003 మే 5) స్పానిష్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటిపి) ఇచ్చే ర్యాంకుల్లో, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకు పొందాడు. అల్కరాజ్ నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, ఐదు మాస్టర్స్ 1000 టైటిళ్లతో సహా 15 ఏటిపి టూర్ -స్థాయి సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు .
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 సెప్టెంబరు 26 - 1946 జూన్ 17) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
సారాయి ఆంధ్ర ప్రదేశ్‌లో వారుణివాహినిగా పిలువబడే ఒక ఆల్కహాల్ కలిగిన మత్తు పానీయం. ఆంధ్రప్రదేశ్ ప్రతి పల్లె పల్లెలో సారాయి దుకాణాలు చూడవచ్చు.తాగి తూలి అరుగులపై పడిపోయే వారు, మద్యం మత్తులో ఇంటా, బయట ఘర్షణలకు దిగేవారి సంఖ్య అధికమవుతోంది.పనిచేసే చోటికి మొబైల్ షాపులూ వెళ్లిపోతున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
చేనేత, ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ. పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, నేతకాని, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, ముదలియార్, కత్రి, సెంగుందం ల కుల వృత్తి. ఈ పరిశ్రమకు అనుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.