The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సంజయ్ ప్రసాద్ కృష్ణమూర్తి (జననం 2 జూన్ 2003) యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ జట్టు తరపున ఆడే అమెరికన్ క్రికెటర్. ఆయన జూన్ 2021లో ఆటగాళ్ల డ్రాఫ్ట్ తర్వాత యునైటెడ్ స్టేట్స్లో జరిగే మైనర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఆయన సెప్టెంబర్ 2021లో ఒమన్‌లో తిరిగి షెడ్యూల్ చేయబడిన ట్రై-సిరీస్ కోసం యునైటెడ్ స్టేట్స్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
సౌరభ్ నరేష్ నేత్రవాల్కర్ (జననం 1991 అక్టోబరు 16) భారతదేశంలో జన్మించిన అమెరికన్ క్రికెటర్, ఆయన యునైటెడ్ స్టేట్స్ జట్టుకు కెప్టెన్ వ్యవహరించాడు. ఆయన భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎడమచేతి వాటం మీడియం-ఫాస్ట్ బౌలర్. ఆయన 2013 డిసెంబరు 22న రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార,కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ప్రస్తుతం 16 జట్లు ఉన్నాయి, ఇందులో ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో మొదటి పది జట్లు, టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేయబడిన ఆరు ఇతర జట్లు ఉన్నాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సైక్ సిద్ధార్థ 2026లో విడుదలైన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. స్పిరిట్ మీడియా, నందునెస్, కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శ్యామ్ సుందర్ రెడ్డి తుడి, శ్రీ నందు నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నందు, యామిని భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 8న, ట్రైలర్‌ను డిసెంబర్ 02న విడుదల చేసి, సినిమాను 2026 జనవరి 1న విడుదల చేశారు.
షాడ్లీ వాన్ షాల్క్వైక్ ( /vən ˈskɒlkveɪk/ , vən SKOLK-vayk ; జననం ఆగస్టు 5, 1988) దక్షిణాఫ్రికాలో జన్మించిన అమెరికన్ క్రికెటర్, అతను ఎమ్మెల్సీ ఫ్రాంచైజ్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, యునైటెడ్ స్టేట్స్ జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆయన ఎడమచేతి బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్, సియాటిల్ థండర్‌బోల్ట్స్ & ఫ్రీ స్టేట్ తరపున క్రికెట్ ఆడాడు. ఆయన కేప్ టౌన్లో జన్మించిన అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ స్టేట్స్కు ప్రాతినిధ్యం వహిస్తాడు.
దండోరా 2025లో విడుదలైన సినిమా. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 17న, ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 25న విడుదల చేశారు.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మాళవిక మోహన్ (ఆంగ్లం: Malavika Mohanan; జననం 1993 ఆగస్టు 04) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. మాళవిక మోహన్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది.
స్టీఫెన్ విలియం హాకింగ్ (1942 జనవరి 8 - 2018 మార్చి 14) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు (విశ్వనిర్మాణ శాస్త్రవేత్త). మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చ్ సంస్థకి డైరెక్టరుగా ఉన్నాడు. ఈయనకు 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది.
యుఫోరియా 2026లో విడుదలైన సోషల్ డ్రామా సినిమా. శ్రీమతి రాగిణి గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 1న, ట్రైలర్‌ను 2026 జనవరి 17న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేశారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
ప్రేమికుల దినోత్సవం (ఆంగ్లం: Valentine's Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు.అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు.దాదాపు ప్రతి సంవత్సరం, నిరసనల కారణంగా భారతదేశంలోని అనేక నగరాల్లో ఫిబ్రవరి 14న శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి.
అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్
అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్. ఇది జాతీయ అండర్-19 జట్లచే పోటీ చేయబడుతుంది. యూత్ క్రికెట్ ప్రపంచ కప్‌గా 1988లో మొదటిసారి నిర్వహించగా 1998 వరకు మళ్లీ నిర్వహించలేదు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
కమల్ హాసన్ ( 1954 నవంబరు 7 లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడిలో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..