The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్.
రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యనమల దివ్య (జననం 1984) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. యనమల దివ్య 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తూర్పు గోదావరి జిల్లా తుని శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. యనమల దివ్య తెలుగు దేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. .
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
పునీత్ రాజ్ కుమార్ (1975 మార్చి 17 - 2021 అక్టోబరు 29) కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్‌కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
షడ్రుచులు అనగా ఆరు రుచులు. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) మానవ అంగిలి ద్వారా సాధారణంగా గుర్తించబడిన ఆరు ప్రాథమిక రుచులు ఉన్నాయి అవి: తీపి, పులుపు, లవణం, చేదు, వగరు, కారం. ప్రతి రుచికి సంక్షిప్త వివరణ ఈ క్రింద ఇవ్వబడింది: తీపి: తీపి తరచుగా చక్కెర లేదా తేనె రుచితో ముడిపడి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఉరుముల తుఫాను ఒక విద్యుత్ సరఫరాలో లేదా ఒక మెరుపు తుఫాను అని పిలిచే ఒక ఉరుము, దీని ఉనికిని కలిగిన మెరుపు, భూమి యొక్క వాతావరణం ఫై దాని శబ్ద ప్రభావాన్నిఉరుములు, అని పిలుస్తారు . సాపేక్షంగా బలహీనమైన ఉరుములను కొన్నిసార్లు ఉరుముల వర్షం అని పిలుస్తారు. క్యుములోనింబస్ అని పిలువబడే ఒక రకమైన మేఘంలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి .
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.
రైస్ ట్రాన్స్లిటరేషన్ స్టాండర్డ్
రైస్ ట్రాన్స్లిటరేషన్ స్టాండర్డ్ (Rice University's Reverse Transliteration Standard లేదా Romanization of Telugu, క్లుప్తంగా RTS) తెలుగు ని ఆంగ్ల అక్షరాలతో వ్రాసే ప్రక్రియ. దీనిని ఆనంద్ కిషోర్, రామారావు కన్నెగంటి సృష్టించారు. పద్మ ఉపకరణంలో దీనిని వాడిన తీరుపై పత్రంలో తెలుగు అక్షరాలతో చూడవచ్చు దీనిని 2002 లో వేమూరి రావు ఆంగ్ల-తెలుగు నిఘంటువు (English-Telugu Dictionary - ISBN 8120616367 లో వాడబడింది.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.