The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
షడ్రుచులు అనగా ఆరు రుచులు. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) మానవ అంగిలి ద్వారా సాధారణంగా గుర్తించబడిన ఆరు ప్రాథమిక రుచులు ఉన్నాయి అవి: తీపి, పులుపు, లవణం, చేదు, వగరు, కారం. ప్రతి రుచికి సంక్షిప్త వివరణ ఈ క్రింద ఇవ్వబడింది: తీపి: తీపి తరచుగా చక్కెర లేదా తేనె రుచితో ముడిపడి ఉంటుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాదియైన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్త, సిద్ధాంతి, జ్యోతిష్కులు వంటివారెవరైనా చదివి, వ్యాఖ్యానించి, శుభాశుభ ఫలాలు వివరించి వినిపిస్తారు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
శుష్క ప్రాంతాలలో పెరిగే భారతీయ ఔషధ మొక్కలు
శుష్క ప్రాంతాలలో పెరిగే భారతీయ ఔషధ మొక్కలుఅనగా తక్కువ వర్షపాతం వున్న ప్రాంతాలు అలాగే తక్కువ భూగర్భ జలాలు వున్న నేలల్లో పెరిగే భారతీయ ఔషధ మొక్కల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా వివరించడం జరిగినది.ఇలాంటి నేలలను ఆంగ్లంలో arid lands లేదా arid soils అంటారు.భారత దేశం అనేక ఔషధ మొక్కలకు నెలవు.మొక్కల యొక్క ఆకులు,వేర్లు,బెరడు, కాండం,కాయలు,పండ్లు ,పూలను ఉపయోగించి వైద్యం చెయవిధం ఆయుర్వేద వైద్య విధానం లో ఒక భాగం.ఆయుర్వేదం లేదా ఆయుర్వేద ఔషధం అనేది భారతదేశానికి చెందిన సాంప్రదాయ ఔషధం. అయుర్వెద చికిత్స ఎంపికలు వైవిధ్యంగా ఉంటాయి అవి యోగా, ఆక్యుపంక్చర్(సూదులను రోగ గ్రస్త ప్రాంతంలో గుచ్చి,స్వస్తత కలిగించదం), మూలికా వైద్రం(చెట్ల మొక్కల భాగాల లెపనం,చూర్ణం లేదా కషాయం,పేదా పొడుల ద్వారా రోగం ను తగ్గించుట), మసాజ్ థెరపీ(దేహ మర్ధన వైద్యం) మరియు అహర పత్య వైద్యం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం (సంస్కృత పదం యొక్క తెలుగు భావం "జీవిత శాస్త్రం" లేదా "జీవితం యొక్క జ్ఞానం") అనేది ప్రపంచంలోని పురాతన మొత్తం శరీర వైద్యం చేసే వ్యవస్థలలో ఒకటి.
శ్రీవిజయ (Indonesian: Sriwijaya), దీనిని శ్రీ విజయ లేదా Sriwijaya అని కూడా ఉచ్చరిస్తారు, అనేది సుమత్రా ద్వీపం (ఆధునిక ఇండోనేషియాలో ఉంది) కేంద్రంగా వెలసిన ఒక మలయ్ సముద్ర-ఆధిపత్య సామ్రాజ్యం; ఇది ఆగ్నేయాసియాలోని చాలా ప్రాంతాలపై తన ప్రభావాన్ని చూపింది. 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు బౌద్ధమతం విస్తరణకు శ్రీవిజయ ఒక ముఖ్యమైన కేంద్రంగా విలసిల్లింది. పశ్చిమ సముద్ర ఆగ్నేయాసియాలోని అధిక భాగాన్ని ఆధిపత్యం చేసిన మొట్టమొదటి రాజకీయ వ్యవస్థ శ్రీవిజయ.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార,కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో 1925వ సంవత్సరంలో స్థాపించారు. స్వామి వివేకానంద, అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
రాజు వెడ్స్ రాంబాయి 2025లో విడుదలైన తెలుగు సినిమా. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
భర్త మహాశయులకు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిరించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ను & గ్లింప్స్‌ని 2025 నవంబర్ 10న, టీజర్‌ను 2025 డిసెంబర్ 21న విడుదల చేశారు.
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 జనవరి 31 - 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ" కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఏడాది గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 2025 నుంచి సినిమా, టెలివిజన్, రంగస్థల ఉత్తమ కళాకారులకు అందించే నంది పురస్కారాలను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరు మీదుగా ఇవ్వనుంది.
పైడి జైరాజ్ (ఆంగ్లము: Paidi Jairaj)(సెప్టెంబరు 28, 1909 - ఆగష్టు 11, 2000) భారత సినీరంగంలో తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత. తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ పేరును రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టారు. ఆయన 1929లో ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే మూకీ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ తో సమానంగా సుమారు ఏడు దశాబ్దాల పాటు ప్రముఖ నటులలో ఒకరిగా కొనసాగి చివరిగా 1995లో ‘గన్ అండ్ గాడ్’ సినిమా చేసి 86 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమ నుంచి తప్పుకున్నాడు.