The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
షేన్ వార్న్ (1969 సెప్టెంబరు 13 - 2022 మార్చి 4) ఆస్ట్రేలియా దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో 1000 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708), 194 వన్డేలు ఆడిన వార్న్ 293 వికెట్లు, ఐపీఎల్లో 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు తీశాడు.
ధర్మాదాత , 1970 లో విడుదలైన తెలుగు డ్రామా చిత్రం . ఎ.సంజీవి దర్శకత్వంలో , రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈచిత్రంలో, అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేయగా , కాంచన, పద్మనాభం, గీతాంజలి, నాగభూషణం మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి, సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు . తమిళంలో 1968 లో వచ్చిన" ఎంగ ఊర్ రాజా" ఈ చిత్రానికి మూలం.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
అనన్య బిర్లా (జననం: 1994 జూలై 17) ఒక భారతీయ గాయని, గేయ రచయిత, వ్యాపారవేత్త. ఆమె భారతీయ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థలలో ఒకరు. 2016 లో, బిర్లా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో సంతకం చేసి తన ప్రారంభ సింగిల్ "లివిన్ ది లైఫ్" అను ఆల్బమ్ ను విడుదల చేసారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఖ్మేర్ సామ్రాజ్యం అనేది ఆగ్నేయాసియా ప్రధాన భూభాగంలో విస్తరించిన ఒక సామ్రాజ్యం; దీని కేంద్రం ప్రస్తుతం ఉత్తర కంబోడియాగా పిలువబడే ప్రాంతంలోని జలనిర్వహణ నగరాలుగా ఉండేది. దీని నివాసులు దీనిని కంబూజ (ప్రాచీన ఖ్మేరు: កម្វុជ; Khmer: កម្ពុជ) అని పిలిచేవారు; ఇది పూర్వపు చెన్లా నాగరికత నుండి ఆవిర్భవించి, సా.శ. 802 నుండి 1431 వరకు కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశంలో కోవిడ్-19 లాక్ డౌన్
2020 జనవరి 30 న కేరళ రాష్ట్రంలో వుహాన్ నుండి వచ్చిన విద్యార్థికి కరోనావైరస్ సోకినట్లు భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. కోవిడ్-19 కేసుల సంఖ్య 500 పెరగడంతో 2020 మార్చి 19 న ప్రధానమంత్రి మోడీ మార్చి 22 ఆదివారం 'జనతా కర్ఫ్యూ' పాటించాలని పౌరులందరినీ కోరారు. తరువాత మార్చి 24 న ప్రధానమంత్రి మోదీ రెండవసారి ప్రసంగిస్తూ 21 రోజుల (2020 మార్చి 25 నుండి - 2020 ఏప్రిల్ 14) పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
కారుణ్య మరణం (English: Euthanasia) చికిత్స లేదని వైద్యులు పేర్కొంటున్న ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తనను చట్టబద్ధంగా చంపమంటూ చేసుకునే విన్నపం, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చంటూ చట్టం అనుమతి ఇచ్చే కోర్టుతీర్పు. బారతదేశంలో మొట్టమొదటి కారుణ్య మరణం 2026 మార్చి 24న ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో నమోదయింది. చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న హరీష్ రాణా అనే ఇంజనీరింగ్ విద్యార్థి 2013లో నాలుగంతస్తుల భవనం నుంచి జారి పడ్డాడు.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి (మార్చి 5, 1920 - నవంబర్ 7, 1992) తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు.ఇతడు సిధ్ధార్థి నామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాటికి సరి అయిన 1920, మార్చి 5వ తేదీన తన మాతామహుడైన ఆకొండి రామ్మూర్తిశాస్త్రి ఇంట్లో ఐలెండు పోలవరం గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి లచ్చమ్మ, తండ్రి సత్యన్నారాయణమూర్తి.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు
1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.
బాజీరావ్ మస్తానీ 2015లో విడుదలైన భారతీయ హిందీ చారిత్రక ప్రేమ విషాద సినిమా. భన్సాలీ ప్రొడక్షన్స్, అంబర్ ఎంటర్టైన్మెంట్, ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. రణవీర్ సింగ్, దీపికా పడుకోణె, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషించగా, తన్వీ అజ్మీ, వైభవ్ తత్వవాడి, మిలింద్ సోమన్, మహేష్ మంజ్రేకర్, ఆదిత్య పంచోలి సహాయ పాత్రలలో నటించారు.
ఢిల్లీ శాసనసభకు 70 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2020 ఫిబ్రవరి 8న ఢిల్లీలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 62.82% ఓటింగ్ నమోదైంది ఢిల్లీలో మునుపటి అసెంబ్లీ ఎన్నికల కంటే 4.65% తక్కువ ఓటింగ్, అయితే ఢిల్లీలో 2019 భారత సాధారణ ఎన్నికల కంటే 2.2% ఎక్కువ. 2015లో ఎన్నికైన అసెంబ్లీ పదవీకాలం 2020 ఫిబ్రవరి 22న ముగిసింది.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
మిస్టేక్ 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఎ.ఎస్.పి.మీడియా హౌస్ బ్యానర్‌పై అభినవ్ సర్దార్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వర్, సుజిత్ కుమార్, తేజ్ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 25న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ఆగష్టు 4న విడుదల చేశారు.
ఇది 1984 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. భార్గవ్ ఆర్ట్స్ పతాకం మీద కొన్ని చిత్రాలు (మనిషికో చరిత్ర, చిలిపిమొగుడు, ముక్కుపుడక) నిర్మించిన ఎస్.గోపాలరెడ్డి, తమిళంలో విజయవంతమైన భారతీరాజా చిత్రం 'మణ్ వాసనై' (మట్టి వాసన) ను తెలుగులో బాలకృష్ణను కథానాయకునిగా పునర్నిర్మించారు. తాతమ్మ కల (బాలనటునిగా బాలకృష్ణ తొలిచిత్రం) కాంబినేషన్ గుర్తు చేస్తూ భానుమతి, బాలకృష్ణ తాతమ్మగా ఈ చిత్రంలో నటించారు.