The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
హోలికా దహనంను హోలికా అనే రాక్షసి బొమ్మ కాలుస్తూ జరుపుకుంటారు.హిందూధర్మం లోని అనేక సంప్రదాయాల ప్రకారం హోళిని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు.దాదాపు భారతదేశంలోని ప్రతి వాడలో హోళికా దహనం నిర్వహిస్తారు. సాంప్రదాయం ప్రకారం, ప్రజలు హోళికా దహనం కోసం ఒకటి లేదా రెండు చెక్క ముక్కలను అందజేస్తారు. ఇది హోలిక తన మేనల్లుడు, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించిన అగ్నిలో కాల్చబడిందని సూచిస్తుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ఇది 2007 నుండి 2009 వరకు ప్రతి బేసి సంవత్సరంలో జరిగింది, 2010 నుండి 2018, 2020 మినహా ప్రతి సరి సంవత్సరంలో జరుగుతోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆసియా ఖండమునకు చెందిన దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా, దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎగువ సభకు అధ్యక్షత వహిస్తారు. చైర్పర్సన్ చర్చలు, సభ కార్యకలాపాలను నియంత్రిస్తారు. ఈ కార్యాలయం 1958 నుండి 1985 మే 31 వరకు ఉనికిలో ఉంది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార,కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు
1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.
పింఛను, అంటే ఏవరైన వ్యక్తికి ప్రతి నెల కొంత సొమ్మును జీవన భృతిగా ఇవ్వడం. భారతదేశంలో పింఛన్ లేదా పింఛను పొందేవారు పలు రకాలుగా ఉన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాలలో వారి రిటైర్ మెంట్ అనంతరం నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను అయితే, పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు లేదా అర్హులైన వారికి ప్రభుత్వం తరపున నెల నెల వచ్చేది ఒక విధమైన పింఛను.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ & స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విష్ణు విన్యాసం 2026లో విడుదల అయిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. హేమ & షాలిని జి సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిరించిన ఈ సినిమాకు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించాడు. శ్రీ విష్ణు, నయన్ సారిక, సత్య, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 18న, ట్రైలర్‌ను ఫిబ్రవరి న విడుదల చేసి సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేశారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల జాబితా
ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుత, గత సభ్యుల జాబితా. రాష్ట్రం తరుపున శాసనమండలికి ఆరు సంవత్సరాల కాలానికి సభ్యులను ఎన్నుకుంటుంది. 20 మంది సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.
మరపురాని కథ 1967, జూలై 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. 1964లో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా విడుదలైన కై కొడుత్త దైవమ్ తమిళ సినిమా నుండి ఈ సినిమాను పునర్మించారు. ఇదే సినిమా 1970లో మలయాళంలో ప్రేమ్ నజీర్, పద్మిని, సత్యన్, జయభారతి ప్రధాన తారాగణంగా పలుంకు పాత్రమ్ అనే పేరుతో, 1971లో అమితాబ్ బచ్చన్, తనూజ జంటగా ప్యార్ కీ కహానీ పేరుతోను రీమేక్ చేయబడింది.
ఉస్తాద్ 2023లోవిడుదలైన తెలుగు సినిమా. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమాకు ఫణిదీప్ రచన,దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలుగు వికీపీడియా (తెవికీ) ఒక ఆన్లైన్ విజ్ఞానసర్వస్వం. 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియాలో ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అమెరికాలో ఉన్న వికీమీడియా ఫౌండేషను అనే స్వచ్ఛంద సంస్థ పలు భాషలలో నెలకొల్పిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఇరాక్ (ఆంగ్లం : Iraq), అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ (అరబ్బీ : جمهورية العراق ), జమ్-హూరియత్ అల్-ఇరాక్, పశ్చిమ ఆసియా లోని ఒక సార్వభౌమ దేశం. దీని రాజధాని బాగ్దాదు. దేశం ఉత్తర సరిహద్దులో, టర్కీ తూర్పు సరిహద్దులో ఇరాన్ (కుర్దిస్తాన్ ప్రాంతం), ఆగ్నేయ సరిహద్దులో కువైట్, దక్షిణ సరిహద్దులో సౌదీ అరేబియా, వాయవ్య సరిహద్దులో జోర్డాన్ పశ్చిమ సరిహద్దులో సిరియా దేశం ఉన్నాయి.
కర్ణాటక యుద్ధాలు (1745-63) 18వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులో వారసత్వం, భూభాగం కోసం జరిగిన పోరాటాలు,, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన దౌత్య, సైనిక పోరాటాలు ఉన్నాయి. ఈ యుద్ధాల ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఐరోపా వ్యాపార కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించింది.