The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
జస్ప్రీత్ జస్బీర్సింగ్ బుమ్రా (జననం 1993 డిసెంబరు 6) అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు తరఫున ఆడే అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్‌తో ఉండే కుడిచేతి ఫాస్ట్ బౌలరైన బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్లో గుజరాత్ తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపునా ఆడతాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యూదియాదేశం లేదా ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.
శ్రీ చిదంబరం గారు 2026లో విడుదలైన ఎమోషనల్ లవ్‌స్టోరీ సినిమా. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించాడు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 అక్టోబర్ 8న, ట్రైలర్‌ను 2026 జనవరి 28న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేశారు.
మన శంకర వరప్రసాద్‌గారు 2026లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, వెంకటేష్, నయన తార,కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టైటిల్‌ను, సినిమా గ్లింప్స్‌ని చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా 2025 ఆగష్టు 22న విడుదల చేశారు.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్,సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణీగా ప్రసిద్ధికెక్కినది.
అక్షర్ రాజేష్‌భాయ్ పటేల్ (జననం 1994 జనవరి 20) ఆటలోని అన్ని ఫార్మాట్లలో స్పిన్ ఆల్-రౌండర్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో గుజరాత్‌కు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఆడతాడు. ఆయన ఎడమచేతి వాటం బ్యాటర్, అలాగే స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.
మహిళా సాధికారత (లేదా స్త్రీ సాధికారత ) అనేది మహిళల దృక్కోణాలను అంగీకరించడం, వాటిని వెతకడానికి ప్రయత్నం చేయడం. విద్య , అవగాహన , అక్షరాస్యత, శిక్షణ ద్వారా మహిళల స్థితిని పెంచడం వంటి అనేక మార్గాల్లో నిర్వచించబడవచ్చు. మహిళల సాధికారత వివిధ సామాజిక సమస్యల ద్వారా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మహిళలను సన్నద్ధం చేసి, అనుమతిస్తుంది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించిన కొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారు.
నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను
మూస:దువ్వాడ-విజయవాడ మార్గము నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా లోని నర్సీపట్నం లో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది.
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యం
'రాజకీయ భాగస్వామ్యం' అనేది చాలా విస్తృతమైన పదం. దీని అర్థం కూడా చాలా విస్తృతమైనది. భాగస్వామ్యం అంటే 'ఓటు హక్కు'కి పరిమితం కాదు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు
1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ట్వంటీ20 క్రికెట్ అంతర్జాతీయ ఛాంపియన్షిప్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్‌ను మొదట ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 అని పిలిచేవారు అనంతరం 2018లో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గా పేరు మార్చారు. ఇది 2007 నుండి 2009 వరకు ప్రతి బేసి సంవత్సరంలో జరిగింది, 2010 నుండి 2018, 2020 మినహా ప్రతి సరి సంవత్సరంలో జరుగుతోంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
దావానలం, దావాగ్ని లేదా కార్చిచ్చు (Forest fire or Wildfire) అనగా అడవులలో సంభవించే అతి త్వరగా వ్యాపించే అగ్ని ప్రమాదాలు. ఇవి మానవుల అలక్ష్యం వలన, మెరుపుల మూలంగా, లేదా అగ్ని పర్వతాల వలన సంభవిస్తాయి. వీటివలన కొంత ప్రయోజనం ఉన్నా కూడా తక్కువ కాలంలో విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతుజాలాన్ని కూడా నాశనం చేస్తాయి.
శాశ్వత ఖాతా సంఖ్య (ఆంగ్లం: Permanent Account Number) ఇది పాన్ కార్డుగా అందరికి పరిచయం. PAN Card అనేది అక్షరాలు అంకెలు కలగలిసి ఉన్న యునిక్ సంఖ్యని భారత ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం గుర్తింపబడిన న్యాయబద్దమైన ఎంటిటీస్ కు జారీ చేయబడుతుంది. ఇది భారతీయ ఆదాయపు పన్ను విభాగం (ఇండియన్ ఇన్ కమ్ టాక్స్ డిపార్త్ మెంట్) జారీ చేస్తుంది.