The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అహింసాత్మకంగా సమావేశం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వీరులపై బ్రిటిషు వారు జరిపిన ఊచకోత. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న బ్రిటిషు సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
నారీ శక్తి వందన్ అధినియమ్ అనేది లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు. నారీ శక్తి వందన్ అధినియమ్ రాజ్యాంగం (నూట ఇరవై ఎనిమిదవ సవరణ) బిల్లు, 2023కు అధికారిక పేరు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబరు 19న భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.
ప్రఫుల్ హింగే (జననం 2002 జనవరి 18) భారతీయ క్రికెట్ ఆటగాడు. ఆయన దేశవాళీ క్రికెట్లో విదర్భ క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. ప్రఫుల్ హింగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో 2024 ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని రాజీవగాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేసి ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు.
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18, 2025న విడుదల చేయగా, సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి తొలి వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాడు. ఆయన 2018 వ సంవత్సరం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారక చిహ్నం
మహాపరినిర్వాన్ భూమి లేదా మహాపరినిర్వాన్ స్థలం అని కూడా పిలువబడే డాక్టర్ అంబేద్కర్ జాతీయ స్మారక చిహ్నం, భారతదేశ జాతీయ రాజధాని న్యూఢిల్లీలో కుల వ్యతిరేక కార్యకర్త & రాజకీయ నాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ కు అంకితం చేయబడిన ఒక స్మారక చిహ్నం.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కైలాస పర్వతం (టిబెట్ భాష: གངས་རིན་པོ་ཆེ, కాంగ్రింబొకె లేదా గాంగ్ రింపోచే; సంస్కృతం: कैलाश पर्वत, కైలాస పర్వత; చైనీస్: 冈仁波齐峰, గంగ్రెన్ బొకి ఫెంగ్ ) టిబెట్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు నది, సట్లేజ్ నది (సింధూ నది యొక్క ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది (గంగా నది యొక్క ఉపనది) ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు (2010)
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది భారతదేశంలోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించినది. 2010 మార్చి 9న ఆ బిల్లు అంటే భారత రాజ్యాంగం (నూట ఎనిమిదవ సవరణ) బిల్లు, 2008కి రాజ్యసభ ఆమోద ముద్రవేసింది.కానీ, అప్పటినుంచి లోక్‌సభలో పెండింగులో ఉన్న ఈ బిల్లు ఆమోదం పొందితేనే చట్టరూపం దాలుస్తుంది. అంటే లోక్‌సభలో మెజారిటీ ఉండే పాలక పార్టీ, కూటమి దీనిపై దృష్టిసారించాల్సిఉంటుంది.
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఇతని భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (సినిమా)
ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు, దర్శకత్వం వహించాడు.
డోనోవన్ ఫెర్రీరా (జననం 1998 జూలై 21) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను వికెట్ కీపరు గా కూడా ఆడగ;ల ఆల్ రౌండరు. అతను 2018 సెప్టెంబరు 14 న, 2018 ఆఫ్రికా T20 కప్‌లో నార్తర్న్స్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు 2019-20 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్తర్న్స్ తరఫున 2019 అక్టోబరు 19 న లిస్ట్ A రంగప్రవేశం చేసాడు.
వరుణ్ రేమండ్ ఆరోన్ (జననం 1989 అక్టోబరు 29) జంషెడ్పూర్ కు చెందిన భారత మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మొదట జార్ఖండ్ అండర్-19, తరువాత జార్ఖండ్ రంజీ జట్టు తరపున ఆడాడు. ఆయన తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) ను అక్టోబరు 2011లో భారతదేశం కోసం ఆడాడు, ఆ మరుసటి నెలలో టెస్ట్ అరంగేట్రం చేశాడు.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
హవాయి ( hə-WY-ee; Hawaiian: Hawaiʻi [həˈvɐjʔi, həˈwɐjʔi]) అనేది యునైటెడు స్టేట్సు ఒక ద్వీప రాష్ట్రం; ఇది పసిఫిక్ మహాసముద్రంలో, అమెరికా ప్రధాన భూభాగంకు నైరుతి దిశలో సుమారు 2,0000 మై(3,200 కి.మీ) దూరంలో ఉంది. (అలాస్కాతో పాటు) అమెరికా ప్రధాన భూభాగంతో భౌగోళికంగా కలసి లేని రెండు రాష్ట్రాలలో ఇది ఒకటి. ఇది ఉత్తర అమెరికా ప్రధాన భూభాగంపై లేని ఏకైక రాష్ట్రం; ఒక ద్వీపసమూహంగా ఉన్న ఏకైక రాష్ట్రం; కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ఏకైక రాష్ట్రం; ఫ్లోరిడాతో పాటు తన పరిధిలో ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతాలను కలిగి ఉన్న కేవలం రెండు రాష్ట్రాలలో ఒకటి; టెక్సాస్‌తో పాటు, అమెరికా రాష్ట్రాలుగా మారకముందు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సార్వభౌమ దేశాలుగా వెలుగొందిన రెండు అమెరికా రాష్ట్రాలలో ఒకటి.
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, English: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); Bengali: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.
నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023
లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ' నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 ' పేరుతో తీసుకొచ్చిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 పేరుతో తీసుకొచ్చిన 128 వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023 సెప్టెంబర్ 20వ తేదీన లోక్ సభ ఆమోదం పొందింది.