The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ది సరిహద్దుల కమిషన్) లేదా సరిహద్దు కమిషన్, అనేదానిని, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం. కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం భారత తాజా జనాభా లెక్కలు ప్రకారం వివిధ శాసనసభల, లోక్‌సభల నియోజకవర్గాల సరిహద్దుల పునఃరూపకల్పన చేయడం ఈ ప్రక్రియ సమయంలో ప్రతి రాష్ట్రం నుండి ఇంతకు ముందు ఉన్న ప్రాతినిధ్యం మార్చబడదు.
రసిఖ్ సలాం దార్ (జననం 5 ఏప్రిల్ 2000) దేశీయ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడే భారతీయ క్రికెటర్. ఆయన డిసెంబర్ 2018లో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంపికైన జమ్మూ కాశ్మీర్ నుండి మూడవ క్రికెటర్ అయ్యాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18, 2025న విడుదల చేయగా, సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
రాజకీయ పక్షాలలో, ముఖ్యంగా కమ్యూనిజం ఆశయాలు పాటించే పార్టీలలో సంస్థాగతమైన నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే విభాగాన్ని పోలిట్‌బ్యూరో లేదా ఆచరణాదేశక వర్గం (Politburo) అంటారు. ఈ విభాగ అధ్యక్ష పదవిని సర్వ కార్యదర్శి (General Secretary) అని వ్యవహరిస్తారు. ఈ వ్యక్తి పార్టీ మొత్తంమీద అధికారాలు కలిగి, గమనాన్ని నిర్దేశించగలుగుతాడు.ప్రతి ప్రధాన రాజకీయ పార్ఠీలు అన్ని పోలిట్బ్యూరోలు కలిగిఉన్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి భారతదేశంలోని బీహార్ రాష్ట్రానికి ప్రభుత్వాధినేత. భారత రాజ్యాంగం ప్రకారం, బీహార్ గవర్నరు రాష్ట్ర డి జ్యూర్ హెడ్, అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. బీహార్ శాసనసభ ఎన్నికల తరువాత, గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
రాజావారు రాణిగారు 2019లో విడుదలైన చిత్రం. ఎస్.ఎల్ ఎంటర్టైన్మెంట్స్ & మీడియా9 బ్యానర్ పై మనోవికాస్.డి, మనోజ్ నిర్మించిన ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో హీరోయిన్లుగా నటించారు. రాజావారు రాణిగారు టీజర్‌ను 2019, నవంబర్ 18న విడుదల చేసి, సినిమాను నవంబర్ 29న విడుదల చేశారు.
ప్రఫుల్ హింగే (జననం 2002 జనవరి 18) భారతీయ క్రికెట్ ఆటగాడు. ఆయన దేశవాళీ క్రికెట్లో విదర్భ క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. ప్రఫుల్ హింగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో 2024 ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని రాజీవగాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేసి ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
లియొనార్డో డా విన్సీ (ఆంగ్లం: Leonardo Da Vinci) (ఏప్రిల్ 15, 1452 – మే 2, 1519) ఇటలీకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, ఇంజనీరు, చిత్రకారుడు,శిల్పకారుడు, ఆర్కిటెక్టు, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత. రినైజెన్స్ శైలిలో ఇతడు చిత్రీకరించిన మోనా లీసా, ది లాస్ట్ సప్పర్ చిత్రపటాలు డా విన్సీకి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకు వచ్చాయి.
వరుణ్ రేమండ్ ఆరోన్ (జననం 1989 అక్టోబరు 29) జంషెడ్పూర్ కు చెందిన భారత మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మొదట జార్ఖండ్ అండర్-19, తరువాత జార్ఖండ్ రంజీ జట్టు తరపున ఆడాడు. ఆయన తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) ను అక్టోబరు 2011లో భారతదేశం కోసం ఆడాడు, ఆ మరుసటి నెలలో టెస్ట్ అరంగేట్రం చేశాడు.
నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023
లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ' నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 ' పేరుతో తీసుకొచ్చిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 పేరుతో తీసుకొచ్చిన 128 వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023 సెప్టెంబర్ 20వ తేదీన లోక్ సభ ఆమోదం పొందింది.