The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
17వ తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2026 ఏప్రిల్ 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 2026 మే 4న భారత ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1% పోలింగ్ నమోదైంది.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ది సరిహద్దుల కమిషన్) లేదా సరిహద్దు కమిషన్, అనేదానిని, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం. కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం భారత తాజా జనాభా లెక్కలు ప్రకారం వివిధ శాసనసభల, లోక్‌సభల నియోజకవర్గాల సరిహద్దుల పునఃరూపకల్పన చేయడం ఈ ప్రక్రియ సమయంలో ప్రతి రాష్ట్రం నుండి ఇంతకు ముందు ఉన్న ప్రాతినిధ్యం మార్చబడదు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు కూడా.
నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023
{{ safesubst:#invoke:Unsubst||$N=Dead end |date=__DATE__ |$B= లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ' నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 ' పేరుతో తీసుకొచ్చిన చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నారీశక్తి వందన్ అదినియమ్ బిల్లు - 2023 పేరుతో తీసుకొచ్చిన 128 వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023 సెప్టెంబర్ 20వ తేదీన లోక్ సభ ఆమోదం పొందింది.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్‌వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు (2010)
మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది భారతదేశంలోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించినది. 2010 మార్చి 9న ఆ బిల్లు అంటే భారత రాజ్యాంగం (నూట ఎనిమిదవ సవరణ) బిల్లు, 2008కి రాజ్యసభ ఆమోద ముద్రవేసింది.కానీ, అప్పటినుంచి లోక్‌సభలో పెండింగులో ఉన్న ఈ బిల్లు ఆమోదం పొందితేనే చట్టరూపం దాలుస్తుంది. అంటే లోక్‌సభలో మెజారిటీ ఉండే పాలక పార్టీ, కూటమి దీనిపై దృష్టిసారించాల్సిఉంటుంది.
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి. రెండు దశల్లో, |2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. 2026 మే 4న 293 స్థానాలకు ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేశారు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
జేమీ ఓవర్టన్ (జననం 10 ఏప్రిల్ 1994) సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడే ఇంగ్లీష్ క్రికెటర్. ఆయన కుడిచేతి ఫాస్ట్ బౌలర్, కుడిచేతి బ్యాటింగ్ చేస్తాడు. ఓవర్టన్ 2012లో సర్రేతో జరిగిన క్లైడెస్‌డేల్ బ్యాంక్ 40లో సోమర్సెట్ తరపున అరంగేట్రం చేసి జూన్ 2022లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
డకోయిట్: ఎ లవ్ స్టోరీ 2026లో విడుదల అయిన భారతీయ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ , ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహించాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18, 2025న విడుదల చేయగా, సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
ప్రకాష్ రాజ్ (జననం ప్రకాష్ రాయ్; 26 మార్చి 1965) ఒక భారతీయ నటుడు, సినిమా దర్శకుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రాజకీయ నాయకుడు. ఆయన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, ఆంగ్ల భాషా చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందారు. ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఎనిమిది నంది పురస్కారాలు, ఎనిమిది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఆరు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, నాలుగు సైమా (SIIMA) పురస్కారాలు, మూడు సినిమా (CineMAA) పురస్కారాలు, మూడు విజయ్ పురస్కారాలతో సహా అనేక ప్రశంసలు ఆయన అందుకున్నారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
సారా అర్జున్ (ఆంగ్లం: Sara Arjun; 2005 జూన్ 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, హిందీ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంది. విక్రమ్ నటించిన తమిళ చిత్రం థైవ తిరుమల్ తో ఆమె బాలతారగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె తమిళం, హిందీలతో పాటు తెలుగు, మలయాళం చిత్రాలలోనూ బాలనటిగా అనేక సినిమాలు చేసింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం
అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) (ఆంగ్లం: World Heritage Day) ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు, గౌడ చరిత్ర ప్రకారము వీరి మూల పురుషుడు కౌండీన్య మహాఋషి అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశలోని వాడే కాబట్టి ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరుశురాముణ్ణి వారి దైవంగా కొలుస్తారు. వీరికి పూర్వ కాలంలో ఉపనయ సంస్కారములు, వేదాధికారము కలదు కానీ కాల క్రమేణా కొన్ని చారిత్రిక కారణలరీత్యా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, ఇంకొన్ని రాష్టాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్‌సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వరుణ్ రేమండ్ ఆరోన్ (జననం 1989 అక్టోబరు 29) జంషెడ్‌పూర్ కు చెందిన భారత మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మొదట జార్ఖండ్ అండర్-19, తరువాత జార్ఖండ్ రంజీ జట్టు తరపున ఆడాడు. ఆయన తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ (ఒడిఐ) ను అక్టోబరు 2011లో భారతదేశం కోసం ఆడాడు, ఆ మరుసటి నెలలో టెస్ట్ అరంగేట్రం చేశాడు.
గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 - ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, ఆచార్య గోగినేని రంగా జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు.
ఘనా సామ్రాజ్యం (Arabic: غانا), దీనిని క్లుప్తంగా ఘనా, ఘనాతా లేదా వాగడు అని కూడా పిలుస్తారు; ఇది ఆధునిక కాలపు ఆగ్నేయ మారిటానియా, పశ్చిమ మాలి ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని వెలసిన ఒక ప్రాచీన పశ్చిమ-సహేలియను సామ్రాజ్యం. ఘనాను పాలించిన రాజవంశం ఎప్పుడు ప్రారంభమైందనే విషయం మీద చరిత్రకారులలో స్పష్టత లేదు. ఈ సామ్రాజ్య రాజవంశం గురించి లిఖితపూర్వక ఆధారాలలో క్రీ.శ.
1950లో మొదటిసారిగా అమలులోకి వచ్చినప్పటి నుండి, మార్చి 2026 నాటికి, భారత రాజ్యాంగానికి 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా సవరించిన జాతీయ రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం ఒకటి. ఇతర ప్రజాస్వామ్య దేశాలలో శాసనం ద్వారా పరిష్కరించబడే అనేక విషయాలు, భారతదేశంలో రాజ్యాంగ సవరణ ద్వారానే పరిష్కరించాల్సినంత వివరంగా రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలను వివరిస్తుంది.
సర్ఫరాజ్ నౌషాద్ ఖాన్ (జననం 22 అక్టోబర్ 1997) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశీయ క్రికెట్‌లో ముంబై తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సర్ఫరాజ్ 2014, 2016లో ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.