The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
జనాభా గణన, అనేది సేకరించిన జనాభా గణాంకాలలోని సభ్యుల గురించి క్రమపద్ధతిలో లెక్కించడం, సమాచారాన్ని పొందడం, నమోదు చేసే విధానాన్ని జనాభా గణనగా పరిగణిస్తారు. జనాభా గణనను ఆంగ్ల భాషలో సెన్సస్ అని అంటారు.ఈ పదం ఎక్కువగా జాతీయ జనాభా, గృహ గణనలకు సంబంధించి ఉపయోగిస్తారు. ఇతర సాధారణ జనాభా గణనలలో వ్యవసాయ, సాంప్రదాయ సంస్కృతి, వ్యాపారం, సరఫరా రద్దీ, వృత్తుల వివరాలు జనాభా గణనలో ఉన్నాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
2011 నాటికి భారతదేశంలో జనాభా లెక్కలను 15 సార్లు నిర్వహించారు.1872 లో బ్రిటిష్ రాజప్రతినిధి మాయో ఆధ్వర్యంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీనిని చేపట్టారు. మొదటి పూర్తి జనాభా గణన 1881లో తీసుకోబడింది. 1949 తరువాత, దీనిని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద, భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ నిర్వహించారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని 2026లో విడుదలకానున్న క్రైమ్ కామెడీ సినిమా. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ శొంఠినేని నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. శివాజీ, లయ, ఆలీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 డిసెంబర్ 21న, ట్రైలర్‌ను 2026 ఫిబ్రవరి 7న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
భూత్ బంగ్లా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 2026 భారతీయ హిందీ భాషా హాస్య భయానక చిత్రం, బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయగా, పరేష్ రావల్, జిష్షూసేన్ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బీ (ద్విపాత్రాభినయం) మొదలైనవారు నటించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, మనోజ్ జోషి నటించిన భూల్ భులయ్యా (2007) తర్వాత ప్రియదర్శన్ రూపొందించిన రెండవ హిందీ భాషా భయానక హాస్య చిత్రం ఇది.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
రాజనీతి శాస్త్రము (political science) ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము 'శక్తినీ', అధికారాన్నీ' అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, ప్రభుత్వం, రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది.
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ 23 నుండి 29 వరకు నిర్వహించబడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 4 మే 2026న జరగనుంది మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి.
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 1973 అక్టోబరు 10 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
డచ్ వలస సామ్రాజ్యం (Nederlandse Koloniale Rijk) అనేది 17వ శతాబ్దం ప్రారంభం నుండి 20వ శతాబ్దం చివరి వరకు, ఏదో ఒక రూపంలో డచ్ నియంత్రణలో ఉన్న విదేశీ భూభాగాలు, ( వాణిజ్య కేంద్రాలు) కలిగిన ఒక వ్యవస్థ. ఇందులో మొదట డచ్ చార్టర్డు కంపెనీలు—ముఖ్యంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (1602–1799), డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ (1621–1792)—ద్వారా నిర్వహించబడిన ప్రాంతాలు, ఆ తదనంతరం డచ్ రిపబ్లికు (1581–1795), ఆధునిక నెదర్లాండ్సు రాజ్యం (1815–1975) ద్వారా పాలించబడిన ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్నాయి. 16వ శతాబ్దం చివరిలో స్పానిష్ సామ్రాజ్యం నుండి ( డచ్ వాస్తవ రిపబ్లిక్కు) స్వాతంత్ర్యం పొందిన తర్వాత, voorcompagnieగా పిలువబడే వివిధ వాణిజ్య సంస్థలు, వ్యాపార అవకాశాల అన్వేషణలో విదేశాలకు సముద్ర యాత్రలను చేపట్టాయి.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
బల్మూరి వెంకట్ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
పరివేషము (గుడి, గాలిగుడి గానూ వ్యవహరిస్తారు) అనేది సూర్యుని, లేక చంద్రుని కాంతికీ, వాతావరణంలోని మంచు స్ఫటికాలకూ మధ్య పరస్పర చర్య జరిగినప్పుడు ఉద్భవించే కాంతీయ దృగ్విషయం (ఆప్టికల్ ఫెనామెనాన్). పరివేషాలు రంగు వలయాలూ, తెల్లటి వలయాలూ, విల్లు ఆకారాలూ, మచ్చలూ, తదితర పలు రూపాల్లో ఉండవచ్చు. వీటిలో చాలా వరకు సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ కనిపిస్తాయి, కానీ ఆకాశంలో ఎక్కడైనా కనిపించవచ్చు.