The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ 23 నుండి 29 వరకు నిర్వహించబడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 4 మే 2026న జరగనుంది మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీశ్రీ రచించిన సంచలన కవితా సంకలనం మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 'మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత' అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి.
బ్యాండ్‌మేళం 2026లో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమా. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో 'ఏ కోన వెంకట్ ప్రొడక్షన్' కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాకు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించాడు. హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్లింప్స్‌ను ఫిబ్రవరి 14న, ట్రైలర్‌ను మార్చి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 26న విడుదల చేశారు.
సీవీ ఆనంద్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి & మాజీ క్రికెట్ క్రీడాకారుడు. సీవీ ఆనంద్ 2021 డిసెంబరు 24 నుండి 2023 అక్టోబరు 12 వరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించాడు. ఆయన 2017లో అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి అందుకున్నాడు.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
వెంకటేశ్ అయ్యర్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఆయన న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఐపీఎల్-2022 వేలంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
హసన్ నవాజ్ అని కూడా పిలువబడే ముహమ్మద్ హసన్ నవాజ్ థిండ్ (జననం 21 ఆగస్టు 2002), కుడిచేతి టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా ఆడే పాకిస్తాన్ క్రికెటర్. మార్చి 2025లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటన కోసం అతను తన తొలి అంతర్జాతీయ కాల్-అప్ అందుకున్నాడు. ఆయన తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం 16 మార్చి 2025న క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు.
తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో 2026లో ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన కల్వకుంట్ల కవిత తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా, తెలంగాణ సామాజిక శక్తులకు గుర్తింపు, సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఈ పార్టీని 2026 ఏప్రిల్ 25న ఏర్పాటు చేసింది. పార్టీ ఆవిర్భావ సభలో కవిత మాట్లాడుతూ పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించింది.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు.
బౌద్ధ పూర్ణిమ లేదా వైశాఖి లేదా విశాఖ అనేది వైశాఖ మాస (మే నెల) పౌర్ణమి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరూ జరుపుకునే పండుగ. ఈ రోజున వివిధ మతపరమైన కార్యక్రమాలు బుద్ధుని జీవిత చరిత్ర బోధనలు చదవటం వంటివి చేస్తారు. ఈ సందర్భంగా మండపాలు, స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేసి ఎక్కడ చూసినా ఉత్సవాలు నిర్వహిస్తారు.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
లుంగిసానీ ట్రూ-మ్యాన్ ఎన్గిడి (జననం 1996 మార్చి 29) దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న ప్రొఫెషనల్ క్రికెటరు. 2018 దక్షిణాఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డులలో, అతను ఐదుగురు క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 2020 జూలైలో, క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డుల వేడుకలో ఎన్గిడి వన్డేలకు, T20I లకూ కూడా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉప జాతీయ అధికార కార్యనిర్వాహక శాఖకు అధిపతి. మంత్రుల మండలికి ముఖ్యమంత్రి అధిపతి. ముఖ్యమంత్రికి మంత్రివర్గంలో మంత్రులను గవర్నరు ద్వారా నియమించే అధికారం ఉంది.
బత్తుల శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన 1994 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్) గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనను తెలంగాణ డీజీపీగా నియమిస్తూ 2025 సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించాడు.
దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమిళనాడు శాసనసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.