The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు. ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు తరువాత 50 రోజులకు పస్కా (క్రోత్త ఫలముల) పండుగ ఆచరించేవారు.
సారాయి ఆంధ్ర ప్రదేశ్‌లో వారుణివాహినిగా పిలువబడే ఒక ఆల్కహాల్ కలిగిన మత్తు పానీయం. ఆంధ్రప్రదేశ్ ప్రతి పల్లె పల్లెలో సారాయి దుకాణాలు చూడవచ్చు.తాగి తూలి అరుగులపై పడిపోయే వారు, మద్యం మత్తులో ఇంటా, బయట ఘర్షణలకు దిగేవారి సంఖ్య అధికమవుతోంది.పనిచేసే చోటికి మొబైల్ షాపులూ వెళ్లిపోతున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
గుమ్మటం ను ఆంగ్లంలో డోమ్ అనీ ఉర్దూ, పార్శీ భాషలో గుంబద్ (گنبد) అనీ అంటారు. ఒక గది యొక్క సగం పైభాగాన గోపురం ఆకారంలో నిర్మించి ఆ గోళాకారపు నిర్మాణ కింది భాగం బోలుగా (ఖాళీ) ఉన్నట్లయితే ఈ గోళాకారపు నిర్మాణ భాగాన్ని గుమ్మటం లేక డోం అంటారు. చరిత్రలో అనేక చారిత్రక కట్టడాలకు కప్పుగా గుమ్మట నిర్మాణశైలిని ఉపయోగించారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
గులకరాళ్ళు, అనగా రాతి శకలాల వదులుగా ఉండే సంకలనం. అనగా ధాన్య పరిమాణపు రాతికణికల నుంచి పెద్దగుండ్రాయి పరిమాణంలో పోగై ఉన్న దృఢీ భవనం కాని రాతి తునకలు. అవక్షేపణ, ఎరోసివ్ భౌగోళిక ప్రక్రియల ఫలితంగా భూమిపై సహజంగా కంకర ఏర్పడుతుంది; ఇది పెద్ద పరిమాణంలో వాణిజ్యపరంగా పిండిచేసిన రాయిగా కూడా ఉత్పత్తి చేయబడుతుంది.
నాగులపల్లి కోదండరామారావు (1903 – 6 డిసెంబర్ 1952), ఎన్.కె. రావుగా సుప్రసిద్ధుడు, హైదరాబాదు సంస్థానంలో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన త్యాగశీలురైన నిస్వార్థ దేశభక్తులలో అగ్రగణ్యుడు. ఆయన గాంధేయవాది, న్యాయవాది, ఉపన్యాసకుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త, గ్రంథాలయోద్యమకారుడు, స్టేట్ కాంగ్రెస్ నాయకుడు, బ్రహ్మచారి.
దృశ్యం 2 2021లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల పై డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. దగ్గుబాటి వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 25 నవంబర్ 2021న విడుదలైంది.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
జస్ప్రీత్ జస్బీర్సింగ్ బుమ్రా (జననం 1993 డిసెంబరు 6) అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు తరఫున ఆడే అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్‌తో ఉండే కుడిచేతి ఫాస్ట్ బౌలరైన బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్లో గుజరాత్ తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపునా ఆడతాడు.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఎన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మన దేశం (1949) 1962వ సం చిత్రం శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ ను చేర్చలేదు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.