The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం. ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
వెంకటేశ్ అయ్యర్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఆయన న్యూజిలాండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ - 2021లో అద్భుత ప్రదర్శన అనంతరం ఐపీఎల్-2022 వేలంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది.
రసిఖ్ సలాం దార్ (జననం 5 ఏప్రిల్ 2000) దేశీయ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడే భారతీయ క్రికెటర్. ఆయన డిసెంబర్ 2018లో 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంపికైన జమ్మూ కాశ్మీర్ నుండి మూడవ క్రికెటర్ అయ్యాడు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
గుమ్మడి నర్సయ్య ఒక భారతీయ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ లేదా CPI (ML) లో ప్రముఖ సభ్యుడు. ఆయన 1983–1994, 1999–2009 మధ్య ఇల్లందు నుండి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన నియోజకవర్గంలోని సభ్యులలో ప్రజా మనిషిగా పేరు సంపాదించారు.
రియా సింఘా భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్, ఆమె భారతదేశంలోని జైపూర్ లో 2024 సెప్టెంబరు 22న మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకుంది. 2024 నవంబరు 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడా, ఆమె టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది.
"బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి" (బుద్ధుడే నా శరణం, ధర్మమే నా శరణం, సంఘమే నా శరణం - బౌద్ధ మతం లోని త్రిరత్నాలు) ఇప్పుడు మహారాజుల కోసం వేసిన ఈ చిత్రాలే రేపు సంగ్రహాలయంలో కనిపిస్తాయో ఏమో, ఎవరికి తెలుసు?' - రాజా రవివర్మ పాశ్చాత్య ప్రభావాల నీలినీడల నుండి భారతీయ చిత్రకళను కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలిగిన కళయే ఆదర్శాత్మక మూలం, అదే కళయొక్క నిజమైన ఆధ్యాత్మికత. - అబనీంద్రనాథ్ ఠాగూర్ కళలో ఆధునికత అనేది, ఆయా సమయాలలో, ప్రజల సజీవ ఆత్మలలో నాటుకుపోయి ఉంటుంది.
భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఇతను 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇతని మంత్రివర్గం లోనే కలసి మంత్రులుగా పనిచేశారు.
ఎన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు.అతను నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. మన దేశం (1949) 1962వ సం చిత్రం శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ ను చేర్చలేదు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.