The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు ఒక రాష్ట్ర న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమిళనాడు శాసనసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ 23 నుండి 29 వరకు నిర్వహించబడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు 4 మే 2026న జరగనుంది మరియు అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి.
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
ఆల్ ఇండియా అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళనాడు రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఇది ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నుండి విడిపోయి 1972 అక్టోబరు 17 న ఎం. జి.
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011).
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉప జాతీయ అధికార కార్యనిర్వాహక శాఖకు అధిపతి. మంత్రుల మండలికి ముఖ్యమంత్రి అధిపతి. ముఖ్యమంత్రికి మంత్రివర్గంలో మంత్రులను గవర్నరు ద్వారా నియమించే అధికారం ఉంది.
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల నుండి ప్రతినిధులను ఎన్నుకోవడానికి 2021 ఏప్రిల్ 6న పదహారవ తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) దశాబ్దాల పాలనకు ముగింపు పలికి ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) విజయం సాధించింది. డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ తమిళనాడు ఎనిమిదవ ముఖ్యమంత్రి అయ్యాడు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
కంజీవరం నటరాజన్ అన్నాదురై (15 సెప్టెంబరు 1909 – 3 ఫిబ్రవరి 1969) తమిళనాడు రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు. ఇతడు 1967-1969ల మధ్యకాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, తమిళనాడులోను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో ద్రావిడ పార్టీకి చెందిన తొలి వ్యక్తి.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభను ఏర్పాటు చేయడం కోసం, 2024 మే 13న రాష్ట్రంలో 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2024 భారత సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎకకాలంలో జరిగాయి. వోట్ల లెక్కింపు 2024 జూన్ 4న జరిగింది.
ప్రశాంత్ కిశోర్ (జననం:1977) భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై, పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు గాను ఆయనను 2020 జనవరి 29న పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్, భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతం చేసుకున్న జ్యోతి బసు 1914 జూలై 8న కోల్‌కాతాలో జన్మించారు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి చెందిన జ్యోతి బసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని వామపక్ష రాజకీయ పార్టీల కూటమి. ఇది 2016 నుండి కేరళ ప్రస్తుత పాలక రాజకీయ కూటమి. కేరళలోని రెండు ప్రధాన రాజకీయ కూటమిలలో ఇది ఒకటి, మరొకటి భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, గత నాలుగు దశాబ్దాలుగా వీటిలో ప్రతి ఒక్కటి ప్రత్యామ్నాయంగా అధికారంలో ఉన్నాయి.
2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు
2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో జరిగిన 17వ పంచవార్షిక శాసనసభ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ శాసనసభలోని మొత్తం 294 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఇది జరిగింది. 292 సీట్లకు సంబంధించిన ఈ ఎన్నికల ప్రక్రియ 2021 మార్చి 27 నుండి 2021 ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరిగింది. మిగిలిన రెండు నియోజకవర్గాలకు పోలింగ్ 2021 సెప్టెంబరు 30 వరకు ఆలస్యం అయింది.
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కేరళ)
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని భారత రాష్ట్రమైన కేరళలో సెంటర్ నుండి సెంటర్ రైట్ రాజకీయ పార్టీల కూటమి. కేరళలోని రెండు ప్రధాన రాజకీయ కూటములలో ఇది ఒకటి, మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, వీటిలో ప్రతి ఒక్కటి 1980 నుండి ఈకె నాయనార్ మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయంగా అధికారంలో ఉంది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లోని చాలా మంది సభ్యులు భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో పాన్-ఇండియా స్థాయిలో సభ్యులుగా ఉన్నారు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
అభిషేక్ బెనర్జీ (రాజకీయ నాయకుడు)
అభిషేక్ బెనర్జీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
'నా మొగుడు నాకే సొంతం' 1989, జూలై,14 న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, జయసుధ, శరత్ బాబు, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం, కె వి మహదేవన్ సమకూర్చారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది. సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి, ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
కేరళ ముఖ్యమంత్రి, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వాధినేత. వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది. కేరళ శాసనసభకు ఎన్నికలు జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయడానికి అత్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ఆహ్వానిస్తారు, దీని మంత్రి మండలి శాసనసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
తమిళనాడు శాసనసభ నియోజకవర్గాల జాబితా
తమిళనాడు రాష్ట్రం 1986 నవంబరు 1 నుండి ఏకసభ వ్యవస్థను అమలు చేస్తోంది రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారాలు తమిళనాడు శాసనసభకు మాత్రమే ఉన్నాయి. ఇది 234 నియోజకవర్గాల నుండి సభ్యులను కలిగి ఉంది, వీరిని ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ సిస్టమ్ ఉపయోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటారు. అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారిని స్పీకర్ అంటారు.ముందుగా రద్దు చేస్తే శాసనసభ పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది.
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు.
మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ, (1901, జూలై 6) ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు.