The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాయలసీమలో నివసించిన 20వ శతాబ్దపు కవులు, రచయితల జీవితవిశేషాలు, సాహిత్యసేవ, కావ్యపరిచయం, కావ్యంలోని ప్రశస్త ఘట్టాలు మొదలైనవాటిని చేర్చి కల్లూరు అహోబలరావు ఈ గ్రంథాన్ని నాలుగు సంపుటాలుగా వెలువరించాడు. ఈ పుస్తకం వెలువడక ముందు రాయలసీమ రచయితలను పరిచయం చేసే పుస్తకాలు జానమద్ది హనుమచ్ఛాస్త్రి గ మాసీమ కవులు వంటివి కొన్ని వచ్చినా అవి బహుళ ప్రచారానికి నోచుకోలేదు. Who is who of Rayalaseema writers గా మాత్రమే కాకుండా ఈ పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడాలని సంపాదకుడి ఆశయం.
ఏర్నెస్టో"చే" గువేరా (ఆంగ్లం: Che Guevara) (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
చింతలపాటి శ్రీనివాస రాజు ఒక భారతీయ పారిశ్రామికవేత్త పెట్టుబడిదారు . చింతలపాటి శ్రీనివాసరాజు సత్యం కంప్యూటర్స్ ఐ లాబ్స్ టీవీ9 లాంటి సంస్థలను స్థాపించాడు. చింతలపాటి శ్రీనివాసరాజు టీవీ9 - తెలుగు మీడియా గ్రూప్ ను తిరుపతిలో శ్రీ సిటీని కూడా స్థాపించారు, శ్రీ సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి "ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ".
స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్. 2018 జూన్‌లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది.
దీప్తి శర్మ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2014 నవంబరు 28న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో, 2016 జనవరి 31న ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. దీప్తి శర్మ ఐసీసీ మహిళా వన్డే కప్ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైంది.
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
భారటి ఫుల్మాలి (జననం 1994 నవంబరు 10) విదర్భ మహిళల క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 13 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ఆడుతోంది, 17 సంవత్సరాల వయస్సులో ఆమె సీనియర్ గా అరంగేట్రం చేసింది. 2019 జనవరిలో, ఆమె 2018–19 సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టులో ఎంపికైంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
భూత్ బంగ్లా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 2026 భారతీయ హిందీ భాషా హాస్య భయానక చిత్రం, బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ద్విపాత్రాభినయం చేయగా, పరేష్ రావల్, జిష్షూసేన్ గుప్తా, రాజ్‌పాల్ యాదవ్, టబు, వామికా గబ్బీ (ద్విపాత్రాభినయం) మొదలైనవారు నటించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, మనోజ్ జోషి నటించిన భూల్ భులయ్యా (2007) తర్వాత ప్రియదర్శన్ రూపొందించిన రెండవ హిందీ భాషా భయానక హాస్య చిత్రం ఇది.
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం (కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట నుండి సికిందరాబాదుకు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 24 కి.మీ. ల దూరంలో ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
శెలవుని శలవు, సెలవు అని కూడా అంటారు. భాధను తగ్గించుకోవడానికి, ఆనందంగా గడపడానికి, కుటుంబ సభ్యులతో గడపడానికి తీసుకునే విరామమే శెలవు. రోజువారి కార్యకలాపాల నుండి ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలను, పనులను ప్రక్కన పెట్టి ఒక రోజును అనుకూలంగా వ్యక్తిగత అవసరాలకు, విశ్రాంతికి అనుగుణంగా ఉపయోగించుకుంటారు, ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధమైన రోజును శెలవు అంటారు.
షెఫాలీ వర్మ (జననం 2004 జనవరి 28) భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. దేశంలో అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ టెండుల్కర్ పేరిట 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
రిచా ఘోష్ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2020 ఫిబ్రవరి 12న ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో, 2021 సెప్టెంబరు 21న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 26 బంతుల్లో 50 పరుగులు చేసి అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.