The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
జయ జయహే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం.ఈ గీతాన్ని అందెశ్రీ రచన చేశాడు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన 'జయ జయహే తెలంగాణ' గీతం 9 చరణాలతో రాష్ట్ర గీతం ఉంటుంది. పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో ఒకటి, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరొక రాష్ట్ర గీతాన్ని అందె శ్రీ, ఎంఎం కీరవాణి రూపొందించారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది. 1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రేషన్ స్టాంప్ లేదా రేషన్ కార్డు అనేది ప్రభుత్వం జారీ చేసే ఒక స్టాంప్ లేదా కార్డు, ఈ కార్డు పొందిన హక్కుదారునికి యుద్ధకాలంలో లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొరత ఏర్పడిన ఆహారాన్ని లేదా ఇతర వస్తువులను పొందేందుకు పరిమితి మేర అనుమతిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇరువైపుల ఏర్పడిన విరోధాల కారణంగా వస్తువుల యొక్క సాధారణ సరఫరాకు ఏర్పడిన ఆటంకాన్ని నిరోధించేందుకు రేషన్ కార్డులను విస్తృతంగా ఉపయోగించారు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 జనవరి 31 - 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ" కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఏడాది గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 2025 నుంచి సినిమా, టెలివిజన్, రంగస్థల ఉత్తమ కళాకారులకు అందించే నంది పురస్కారాలను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరు మీదుగా ఇవ్వనుంది.
సెర్బియన్ సామ్రాజ్యం pronounced [sr̩̂pskoː tsâːrstʋo]) అనేది సెర్బియా రాజ్యం నుండి ఆవిర్భవించిన ఒక మధ్యయుగ సెర్బియన్ దేశం. ఇది 1346లో, తన రాజ్యాన్ని గణనీయంగా విస్తరించిన శక్తివంతుడైన డుషాన్చే స్థాపించబడింది. డుషాన్ పాలనలో, సెర్బియా అత్యంత శక్తివంతమైన యూరోపియన్ దేశాలలో ఒకటిగా, ఆగ్నేయ ఐరోపాలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యంగా వెలుగొందింది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ (ఆంగ్లం: South Coast Railway, SCoR) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కేంద్రంగా భారత ప్రభుత్వం భారతీయ రైల్వేలలో కొత్త రైల్వే జోన్ ప్రకటించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది. ఈ జోన్ నిర్వహణ కోసం అధికారిక నోటిఫికేషన్ (2025 ఫిబ్రవరి 6 నాటికి) ఇంకా జారీ కాలేదు.
రజత్ పాటిదార్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మధ్య ప్రదేశ్ తరపున 2020 నుండి 2022 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉండి ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
మంత్రి (Minister) అనే పదం పూర్వకాలం నుండి వాడబడుతుంది.రాచరికాలు,రాజ్యాలు ఉండే పూర్వకాలంలో ఉన్నప్పుడు మంత్రిని అమాత్యులు, రాజప్రతినిధి, దివాను అని వ్యవహరించేవారు.వీరు మహారాజుకు ముఖ్యమైన సలహాదారుడుగా ఉండేవాడు.దానికి ఉదాహరణగా మహామంత్రి తిమ్మరుసును చెప్పుకోవచ్చు. సంబోధనా పదం ' అమాత్యా ' అని సంబోదించేవారు.వివిధ రంగాలకు వివిధ మంత్రులు లేదా అమాత్యులు వుండేవారు.ప్రధానమైన మంత్రిని మహామంత్రి అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో కేంధ్రప్రభుత్వంలో ప్రధాన మంత్రి,రాష్ట్ర ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి అని వ్యవహరింపబడుతుంది.వివిధ విభాగాలకు ఉన్న మంత్రులు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి అదీనం క్రింద వారికి కేటాయించిన శాఖల పరిపాలనపై నియంత్రణాధికారం కలిగి ఉంటారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగాంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
దివ్యేందు శర్మ (జననం 1983 జూన్ 19), హిందీ సినిమా, సిరీస్‌లలో పనిచేసే భారతీయ నటుడు. హాస్య చిత్రం ప్యార్ కా పంచనామా (2011)లో తన నటనకు ఉత్తమ అరంగేట్రం - స్క్రీన్ అవార్డు గెలుచుకున్నాడు, ఆ తర్వాత, ఆయన చష్మే బద్దూర్ (2013), టాయిలెట్ః ఏక్ ప్రేమ్ కథ (2017) చిత్రాలలో సహాయక పాత్రలు పోషించాడు. అతను మిర్జాపూర్ (2018-2020) అనే డ్రామా సిరీస్, ది రైల్వే మెన్ (2023) వంటి చిన్న సిరీస్‌లలో తన పాత్రల ద్వారా మరింత దృష్టిని ఆకర్షించాడు.
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.
సుమన్ కళ్యాణ్పూర్ (28 జనవరి 1937) భారతీయ నేపథ్య గాయని, ఆమె హిందీ సినిమాల్లో తన కృషికి ప్రసిద్ధి చెందింది . ఆమె హిందీ , బెంగాలీ , మరాఠీ , అస్సామీ , గుజరాతీ , కన్నడ , అంగికా , భోజ్‌పురి , రాజస్థానీ , ఒడియా, పంజాబీలతో పాటు అనేక భాషలలోని సినిమాలకు పాటలు పాడింది. ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరంతో సమానంగా ఉండటం వల్ల ఆమె గొంతును ఆమె గొంతుగా తప్పుగా భావించేవారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1న జరపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించబడిన ఈ ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగిసాయి.