The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ (ఆంగ్లం: Sonam Wangchuk; జననం: 1966 సెప్టెంబరు 1), భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.
ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.
అందెశ్రీ (1961 జూలై 18 - 2025 నవంబరు 10) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించాడు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకుగాను 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ.కోటి నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయురాలు, విద్యావేత్త) విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి. ఉపాధ్యాయుడి పాత్రను ఎవరైనా తీసుకోవచ్చు (ఉదా: ఒక నిర్దిష్ట పనిని ఎలా చేయాలో సహోద్యోగికి చూపించినప్పుడు). కొన్ని దేశాల్లో, పాఠశాల లేదా కళాశాల వంటి నియత విద్య కాకుండా, ఇంటిలో వారే పిల్లలకు విద్య నేర్పడం (హోమ్‌స్కూలింగ్) లాంటి వంటి అనియత విద్య ద్వారా చిన్నారులకు విద్య నేర్పవచ్చు.
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 - డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు.
కమిటీ కుర్రోళ్లు 2024లో విడుదలైన తెలుగు సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న, ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా, సినిమా ఆగస్ట్ 9న సినిమా విడుదలైంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
దిగంత్ మంచాలే (జననం 28 డిసెంబర్ 1983), వృత్తిపరంగా దిగంత్ అని పిలుస్తారు, ప్రధానంగా కన్నడ సినిమాలలో పనిచేసే భారతీయ నటుడు. దిగంత్ మిస్ కాలిఫోర్నియా 2006లో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేసి ఆ తరువాత 2008లో గాలిపట సినిమాలో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. ఆయన నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌కు నామినేషన్‌లతో పాటు రెండు సైమా అవార్డులను అందుకున్నాడు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
గార్‌ఫీల్డ్ సోబర్స్ (ఆంగ్లం: Garfield St Auburn Sobers; 1936 జూలై 28 – 2026 జూలై 17), వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్‌లో 57.78 సగటుతో 8032 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టాడు. 1936 జూలై 28న బార్బడస్ లోని బ్రిడ్జిటౌన్ లో జన్మించిన సోబర్స్ 1953లో తన 17వ ఏటనే టెస్ట్ క్రికెట్లో ప్రవేశించాడు.
పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
శ్రీ రాజరాజేశ్వరి మా మహామాయా దేవి మందిర్ రాయపూర్ లేదా ప్రసిద్ధి చెందిన మహామాయ ఆలయం ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లోని పురాణి బస్తీలో ఉన్న దేవి మహామాయకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఛత్తీస్ గఢ్ 36 శక్తిపీఠాలు లేదా 36 కోటలలో ఈ ఆలయం ఒకటి. దీనిని 17వ-18వ శతాబ్దాల మధ్య మరాఠా సమాఖ్య పాలకులు పునరుద్ధరించారు.
చతుర్ముఖం 2021లో విడుదలైన తెలుగు సినిమా. మంజు వారియర్, సన్నీ వెనె, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రంజిత్ కమల శంకర్ సలీల్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో 8 ఏప్రిల్ 2021లో విడుదలైన ‘చతుర్ముఖం’ తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి ట్రైలర్‌ను ఆగష్టు 10, 2021న విడుదల చేసి, ఆహా ఓటీటీలో సినిమాను ఆగష్టు 13, 2021న విడుదల చేశారు.
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
ఒక బృందావనం 2025లో విడుదలైన తెలుగు సినిమా. సీర్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించిన ఈ సినిమాకు బొత్స సత్య దర్శకత్వం వహించాడు. బాలు, షిన్నోవా, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 15న విడుదల చేయగా, సినిమాను మే 23న విడుదల చేశారు.
శ్రీరమణ (1952 సెప్టెంబరు 21 - 2023 జులై 18) ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత. సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయితగా సుప్రఖ్యాతుడు. పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించారు.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆర్టికల్ 370 (2024 హిందీ సినిమా)
ఆర్టికల్ 370 2024లో విడుదలైన హిందీ సినిమా. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే అంశాన్ని ప్రధానంగా తీసుకొని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్‌లపై ఆదిత్య ధర్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభ దర్శకత్వం వహించాడు. యామీ గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 20న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేసి సినిమాను ఫిబ్రవరి 23న విడుదల చేశారు.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
మద్దెలచెరువు సూర్యనారాయణ (సూరి) రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు. 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు.