The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
నైలు నది : (ఆంగ్లం : Nile) (అరబ్బీ భాష : النيل " అల్-నీల్"), ఆఫ్రికాలో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన నది..కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని పరిశోధనల ఆధారంగా అమెజాన్ నది పొడవై ఉండవచ్చునని కొద్ది మంది భావిస్తున్నారు. దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి.
లౌకికవాదాన్ని సాధారణంగా పౌర వ్యవహారాలకు సంబంధిచినదిగా లేదా జాతీయావాదం నుండి మతాన్ని వేరుచేయడం అని నిర్వచించారు. యాంటిక్లెరికలిజం, నాస్తికత్వం, సహజత్వం లేదా ప్రభుత్వ సంస్థల నుండి మతపరమైన చిహ్నాలను తొలగించడం వంటివి ఈ పదానికి విస్తృత అర్ధాలుగా సూచించవచ్చు. లౌకికవాదం అనే పదాన్ని మొట్టమొదట 1851 లో బ్రిటిష్ రచయిత జార్జ్ హోలీయోక్ ఉపయోగించారు .
రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.
అయోమయ నివృత్తికి చూడండి స్వర్గం (సినిమా) స్వర్గం ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నా, సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించేవారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మతసంప్రదాయానికి లేదా తెగకు చెందినవాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మతాలు మరణం తర్వాత ఆత్మలు అమరత్వంతో ప్రశాంత జీవనం గడిపే ఒక ప్రదేశంగా స్వర్గాన్ని సూచిస్తాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
అమీన్పూర్ (సంగారెడ్డి జిల్లా)
అమీన్పూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అమీన్పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.
వికసిత్ భారత్ - జీ రామ్ జీ చట్టం -2025
వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు, 2025 దీనినే VB–G RAM G Act, 2025 అంటారు. ఇది 'పని చేసే హక్కు' హామీ ఇచ్చే లక్ష్యంతో రూపొందించిన భారతీయ సాంఘిక సంక్షేమ చట్టం. దీనిని 18-19 డిసెంబర్ 2025న భారత పార్లమెంటు ఆమోదించింది.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
బ్రహ్మాజీ ఒక పేరొందిన తెలుగు నటుడు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో, ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్, మిరపకాయ్, మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
కుమారావత శ్రీనివాస రెడ్డి (జననం 14 ఫిబ్రవరి 1972), ఆయనను సినీరంగంలో శ్రీమాన్ అని పిలుస్తారు. ఆయన సేతు (1999), ఫ్రెండ్స్ (2001) పంచతంతిరం (2002), ఆయుత అక్షరం (2004), పోక్కిరి (2007), ఏగన్ (2008), ముని 2: కాంచన (2011)' కాంచన 2 సినిమాల్లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రీమాన్ సినీ నిర్మాత ప్రకాష్ రెడ్డి కుమారుడు.
కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం (పుణ్యక్షేత్రం). మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ఏప్రిల్ (అక్షయ తృతీయ), నవంబరు (కార్తీక పూర్ణిమ, శరదృతువు పౌర్ణమి) మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది.
సీతా కోల్మన్-కమ్ముల ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త, పర్యావరణవేత్త, వ్యవస్థాపకురాలు. ప్లాస్టిక్‌లను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్ పరిశ్రమలో 25 సంవత్సరాలకు పైగా పనిచేసిన తర్వాత, ఆమె 2005లో పర్యావరణ సలహా సంస్థను ప్రారంభించింది. ఆమె సంస్థ పారిశ్రామిక జీవావరణ శాస్త్రం, ఉత్పత్తుల జీవిత చక్రం యొక్క అంచనాపై దృష్టి పెడుతుంది, తద్వారా వ్యర్థ ఉత్పత్తుల యొక్క భవిష్యత్తు ప్రభావాన్ని పర్యావరణపరంగా తెలుసుకునే ప్రక్రియలలో వాటిని తయారు చేస్తారు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనేది ఇంటింటి లెక్కింపు, ముందే నింపిన ఫారాలు, పాత ఓటరు డేటా ధ్రువీకరణ ద్వారా ఓటరు జాబితాలను ధ్రువీకరించడానికి, సవరించడానికి భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ. అర్హులైన పౌరులు తప్పిపోకుండా చూసుకుంటూ, మరణించిన, శాశ్వతంగా మార్చబడిన, నకిలీ, పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు కచ్చితమైనవని నిర్ధారించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను 2025 అక్టోబరు 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించాడు.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.