The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.
డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
రైటర్ పద్మభూషణ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. సుహాస్, టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 03న విడుదలైంది.
మ్యాడ్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి) (1922 - 1993) వృత్తి రీత్యా న్యాయవాది, కథా రచయిత. ఆయన కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు".
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
కేరళ (మళయాళం: കേരളം [కేరళం], ఆంగ్లం: Kerala)తెలుగు రాష్టాలకు నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం. కేరళ సరిహద్దులలో తూర్పు, ఉత్తరం కర్ణాటక, తూర్పు తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన తమిళనాడుకు చెందిన కన్యాకుమారి జిల్లా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రవి దూబే (జననం 1983 డిసెంబరు 23) భారతీయ నటుడు, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత. ఆయన 2006లో స్త్రీ తేరీ కహానీ షోతో తన నటనా వృత్తిని ప్రారంభించాడు, తరువాత డాలీ సజా కే (2007), యహాన్ కే హమ్ సికందర్ (2007) వంటి షోలలో నటించాడు, తరువాత కుటుంబ డ్రామా షోలైన సాస్ బినా ససురాల (2010), జమాయ్ రాజా (2014) లలో నటించాడు, ఇది అతన్ని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టీవీ నటులలో ఒకరిగా నిలబెట్టింది. ఆయన రియాలిటీ షోలు నాచ్ బలియే 5 (2012), ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 8 (2017) లలో కూడా పాల్గొన్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
సుజాత దీక్షిత్ తెలుగు నాటకరంగ, టీవీ, సినిమా నటి, వ్యాఖ్యాత. పలు టీవి ఛానళ్ళలోనూ, స్టేజీల మీద వివిధ కార్యక్రమాలకు, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుజాత, వి6 న్యూస్ ఛానల్లో ప్రసారమవుతున్న తీన్మార్ వార్తలు కార్యక్రమంలో చంద్రవ్వ పాత్రతో గుర్తింపు పొందింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి నాటకరంగంలో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
మోహిత్ రైనా (జననం 14 ఆగస్టు 1981) హిందీ సినిమాలు, టెలివిజన్లలో నటించే భారతీయ నటుడు. ఆయన తన నటనా జీవితాన్ని అంతర్రిక్ష్ (2004) సైన్స్ ఫిక్షన్ షోతో ప్రారంభించాడు, ఆ తరువాత డాన్ ముత్తు స్వామి (2008) లో ఒక పాత్రను పోషించాడు. ఆయన టెలివిజన్ ధారావాహిక డెవోన్ కే దేవ్ - మహాదేవ్, మహాభారత్‌లో హిందూ దేవుడు శివుని ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందాడు, దీనికి ముందు ఆయన చెహ్రా, గంగా కీ ధీజ్, బందినిలో సహాయక పాత్రలకు ప్రసిద్ధి చెందాడు.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.