The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.కాళోజీ పుట్టిన రోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను )
మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను )ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సంఘ సేవకుడు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా (2021–ప్రస్తుతం) వ్యవహరిస్తున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్ కాంగ్రెస్) విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, విశాఖ జిల్లా భీమునిపట్నం శాసనసభా నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇంచార్జిగా ఉన్నారు.
కొరియన్ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
యునెస్కో (UNESCO) సెప్టెంబర్ 8 తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (ఆంగ్లం: International Literacy Day) గా ప్రకటించింది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
వినియోగదారుడు (Consumer) సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే, దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది.
సర్వేపల్లి రాధాకృష్ణ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
కంజీవరం నటరాజన్ అన్నాదురై (15 సెప్టెంబరు 1909 – 3 ఫిబ్రవరి 1969) తమిళనాడు రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు. ఇతడు 1967-1969ల మధ్యకాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, తమిళనాడులోను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో ద్రావిడ పార్టీకి చెందిన తొలి వ్యక్తి.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మార్కాపురం జిల్లాలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన నల్లమల సాగర్ జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.
డా.వాకిటి శ్రీహరి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2025 జూన్ 8న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, చేయగా, జూన్ 11న పశుసంవర్థక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడలు & యువజన సర్వీసుల శాఖలను కేటాయించింది. డా.వాకిటి శ్రీహరి 2025 జూన్ 12న ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమితుడయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషాదినోత్సవం (తెనుగు నుడినాడు) గా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.
అద్దంకి కేశవరావు (1918 సెప్టెంబరు 8 - 2005 నవంబరు 11) విశ్రాంత ఉపాధ్యాయులు, శ్రీమతి అద్దంకి రాజ్యలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శిని బాలవిహార్ వ్యవస్థాపకులు, 'తధాగతీయము' (సంపూర్ణ గౌతమ బుద్ధ చరితము) నిర్వచన పద్య కావ్య కర్త, బహుభాషా వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, పాటల రచయిత, నాటక కర్త, సంగీతజ్ఞుడు, వ్యాసకర్త, స్కౌట్ పుస్తకాల రచయిత. అద్దంకి కేశవరావు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చే గ్రంథం ‘తథాగతీయము’. కారణము 4088 పద్యాల నిర్వచన బృహత్ గ్రంథమది.
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. 2013 నవంబరు 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.