The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మింప తలపెట్టిన సేద్యపు నీటి ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు / కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్టు (Pulichintala project / K L Rao Sagar Project). విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉంది.
ఈస్టర్ (Greek: Πάσχα హిబ్రూ భాషలో పస్ఖా,: פֶּסַח పెసఖ్, నుండి) క్రైస్తవుల ప్రార్థనా పరమైన సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ. క్రైస్తవ గ్రంథాలను బట్టి, క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుండి మూడవ దినమున పునరుత్థానం చెందాడు. కొంతమంది క్రైస్తవులు ఈ పునరుత్థానం ఈస్టర్ దినము లేదా ఈస్టర్ ఆదివారం (పునరుత్థాన దినము లేదా పునరుత్థాన ఆదివారం అనికూడా) గుడ్ ఫ్రైడే తరువాత రెండు రోజుల పిమ్మట మరియు మౌన్డి గురువారం గడచిన మూడురోజుల తరువాత జరుపుకుంటారు.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంధాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
గ్రీక్ పురాణశాస్త్రం (Greek Mythology) అనేది ప్రాచీన గ్రీకులకు సంబంధించిన దేవుళ్ళు మరియు శూరులు, ప్రపంచ పోకడ, మరియు ఉద్భవం, వారి సొంత సంస్కృతి యొక్క ప్రాముఖ్యత, ఆచార కర్మల సాధనకు సంబంధించిన కల్పిత కథలకు మరియు పురాణ గాథలకు మూలంగా ప్రసిద్ధి చెందినది. అవి ప్రాచీన గ్రీస్ లో మతంలో ఒక భాగంగా ఉండేవి. ఆధునిక పరిశోధకులు పురాణాలను సూచిస్తారు మరియు ప్రాచీన గ్రీస్ యొక్క మతపరమైన మరియు రాజకీయ సంస్థలుమ దాని నాగరికత గురించి తెలుసుకోవటానికి మరియు పురాణం యొక్క స్వభావాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ వాటిని అధ్యయనం చేస్తారు.గ్రీక్ పురాణశాస్త్రం ఒక పెద్ద రచనల సేకరణలో స్పష్టంగా నిక్షిప్తం చెయ్యబడింది మరియు పూలకుండీల చిత్రీకరణలు మరియు ప్రమాణపూర్వకంగా ఇవ్వబడిన బహుమతులు వంటి ప్రాతినిధ్యపు కళలలో పరిపూర్ణంగా నిక్షిప్తం అయి ఉంది.
ప్రీమియర్ లీగ్ అనేది అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సంబంధించిన ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ లీగ్. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్ వ్యవస్థ అగ్రభాగంలో ఉన్న ఈ లీగ్ దేశంలో ప్రధాన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా పరిగణించబడుతుంది. దీనిలో 20 క్లబ్‌లు పోటీపడతాయి, ఇది ఫుట్‌బాల్ లీగ్‌తో కలిసి ప్రమోషన్ అండ్ రెలిగేషన్ (స్థానోన్నతి మరియు స్థాన తగ్గింపు) వ్యవస్థలో నిర్వహించబడుతుంది.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
ఆంధ్ర రాష్ట్రం (Andhra State; Āndhra, IPA: [ˈɑːndʰrʌ]) భారతదేశంలో ఒక రాష్ట్రంగా 1 అక్టోబరు, 1953 తేదీన ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్.
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
భారతదేశంలో ప్రాథమిక హక్కులు (ఆంగ్లం : Fundamental Rights in India' ref>
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల మరియు దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
పవిత్ర ఆత్మ (ఇంతకు ముందు వాడుక ఆంగ్ల భాషలో: పవిత్ర దయ్యము (పాత ఆంగ్లము నుంచి గస్ట్ అంటే, "ఆత్మ") అనేది అరమిక్ మాథ్యూ, శాస్త్రీయమైన దైవ వాక్యములచే మరియు పవిత్ర మూర్తి త్రయములోని తండ్రి, కొడుకు మరియు పవిత్ర ఆత్మలో చెప్పబడినది, ఇందులో పవిత్ర ఆత్మే, సర్వ చక్రవర్తి అయిన భగవంతుడు. క్రైస్తవులు ఈ ముగ్గురు ఒకటే అయిన దేవుడు తానే ముగ్గురు వ్యక్తులుగా ఉద్భవించిన ఒక వ్యక్తిగా లేదా గ్రీక్ మూర్తిత్రయము లలో ఒకటిగా చూస్తారు. (మూర్తిత్రయములోని మనుష్యత్వము అనేది మామూలు పడమర ప్రాంతములో "మనిషి" అనే అర్ధం వచ్చేలా ఆంగ్లములో చెప్పిన దానితో సరిపోదు—అది "ఏకైక, తన నిజము చుట్టూ ఉన్న స్వతంత్రము మరియు జాగురూకతతో కూడిన పని"తో కూడా సరిపోదు).దైవ వాక్యములలో క్రీస్తుయేసు పరిశుద్ధుడైన మేసయ్య గాను,ఇతను నీటితో కాకుండా ప్రవిత్ర ఆత్మ మరియు నిప్పుతో జ్ఞాన స్నానము చేసేవాడుగాను చెప్పబడింది.మూస:Bibleref2c క్రీస్తు తన ఆఖరు రాత్రి భోజనము సమయములో కలిగిన ఆవేశమునకు కొంచెం ముందుగా, తండ్రి నుంచి మరొక సాంత్వనీకుని ప్రపంచము కొరకు పంపిస్తానని ఒట్టు పెట్టాడు, ఈ పవిత్ర ఆత్మ, దేవదూతల చర్యలలో నమోదు చేయబడినట్లు, క్రీస్తు స్వర్గారోహణం చేసిన తరువాత,ఈ నిజము యొక్క ఆత్మ మూస:Bibleref2cదేవదూతల చర్యలను మరియు చర్చ్ కు కావలసినవి కనిపించకుండానే ఆదేశిస్తుంది,అవసరములు తీరుస్తుంది,బోధ చేస్తుంది.
2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాలు చూరగొని వీక్షకుల వలన విజయవంతమై,అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 నాటికి మన వికీపీడియా 5వ స్థానంలో ఉంది.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
యూట్యూబు అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం మరియు కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది మరియు తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
భారతదేశంలో అక్షరాస్యత సామాజిక-ఆర్థిక పురోగతికి కీలకంగా ఉంది, భారత అక్షరాస్యత రేటు 2007లో 68%నికి పెరిగింది, 1947లో బ్రిటీష్ పాలన ముగిసిన సమయంలో దేశ అక్షరాస్యత రేటు 12% మాత్రమే ఉంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (NSSO) జూన్ 2008లో నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, 7 మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగల జనాభాలో అక్షరాస్యత రేటు 72% వద్ద ఉండగా, వయోజనుల్లో (15 మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగలవారు) అక్షరాస్యత రేటు 66% వద్ద ఉంది. ఇదిలా ఉంటే, భారత అక్షరాస్యత రేటు, ఐదురెట్ల కంటే ఎక్కువ వృద్ధి సాధించినప్పటికీ, ప్రపంచ అక్షరాస్యత సగటు 84%తో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది, ప్రపంచంలో భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద నిరక్షరాస్య జనాభా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్ యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపో యిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట పౌలు గారిచే అంతియొకయలో యేసు వారి శిష్యలకు క్రైస్తవులు అనే పేరు పెట్టారు. ఈయన యేసు క్రీస్తుగా కూడా వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది.
గమనిక భగవద్గీత అధ్యాయానుసారం (సంస్కృతం తెలుగు లిపిలో) పూర్తి పాఠము వికీసోర్స్లో ఉంది. భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్లో ఉన్నది: భగవద్గీత (తెలుగు అనువాదము) భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.
భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 – 1931 మార్చి 23) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు.