The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మింప తలపెట్టిన సేద్యపు నీటి ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు / కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్టు (Pulichintala project / K L Rao Sagar Project). విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉంది.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
ఈస్టర్ (Greek: Πάσχα హిబ్రూ భాషలో పస్ఖా,: פֶּסַח పెసఖ్, నుండి) క్రైస్తవుల ప్రార్థనా పరమైన సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ. క్రైస్తవ గ్రంథాలను బట్టి, క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుండి మూడవ దినమున పునరుత్థానం చెందాడు. కొంతమంది క్రైస్తవులు ఈ పునరుత్థానం ఈస్టర్ దినము లేదా ఈస్టర్ ఆదివారం (పునరుత్థాన దినము లేదా పునరుత్థాన ఆదివారం అనికూడా) గుడ్ ఫ్రైడే తరువాత రెండు రోజుల పిమ్మట మరియు మౌన్డి గురువారం గడచిన మూడురోజుల తరువాత జరుపుకుంటారు.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
భారతదేశంలో ప్రాథమిక హక్కులు (ఆంగ్లం : Fundamental Rights in India' ref>
లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ ( Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) (ఏప్రిల్ 22, 1870 – జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
మూస:Infobox Brand ల్యాండ్ రోవర్ అనేది ప్రస్తుతం ఒక విలాసవంతమైన-రకపు నాలుగు-చక్రాల డ్రైవ్, అన్ని-భూభాగాల వాహనపు తయారీ సంస్థ, ఇది గేడన్, వార్విక్షైర్, ఇంగ్లాండ్ లో ఉంది. ఇది భారతదేశంలోని టాటా మోటర్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్ వ్యాపార విభాగంగా నడపబడుతుంది.నిజానికి ల్యాండ్ రోవర్ అనే పదం ఒక ప్రత్యేక వాహనాన్ని (చూడండి ల్యాండ్ రోవర్ సీరీస్) సూచిస్తుంది, ఇది ప్రథమంగా పౌరుల కోసం తయారైన అన్ని-భూభాగాల ఉపయోగ వాహనం, దీనిని 1948 ఏప్రిల్ 30 నాడు, ఆమ్స్టర్డాం మోటర్ షోలో ప్రదర్శించారు, కానీ తరువాత ఎన్నో విభిన్న నాలుగు-చక్రాల డ్రైవ్ నమూనాలకు బ్రాండ్ గా ఉపయోగించారు. రోవర్ కంపెనీ యొక్క ఉత్పత్తి శ్రేణిలో నమూనాగా మొదలై, ల్యాండ్ రోవర్ బ్రాండ్, మొదట పేరుగా, తరువాత విడి సంస్థగా, నాలుగు-చక్రాల డ్రైవ్ సామర్థ్యం కలిగిన వాహనాల శ్రేణిని వరుస యజమానులకు అభివృద్ధి చేసింది, ఇందులో బ్రిటిష్ లేలాండ్, బ్రిటిష్ ఏరోస్పేస్, మరియు BMWలు ఉన్నాయి.
2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాలు చూరగొని వీక్షకుల వలన విజయవంతమై,అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 నాటికి మన వికీపీడియా 5వ స్థానంలో ఉంది.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంధాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009) ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
యూట్యూబు అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
' వెనుజులా Venezuela (/ˌvɛnəˈzweɪlə/ VEN-ə-ZWAYL-ə; Spanish pronunciation: [beneˈswela]) దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా మరియు ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ మరియు టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 kమీ2 (9.86453×1012 చ .అ) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది.
ICT గా పిలువబడే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కి ప్రర్యాయంగా వాడబడుతుంది, కాని అది ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టెలీకమ్యునికేషన్స్ (టెలిఫోన్ లైన్లు మరియు వైర్లెస్ సిగ్నల్స్) యొక్క పాత్రను తెలిపుతుంది. ICT లో సమాచారాన్ని నిర్వహించుటకు మరియు సమాచార మార్పిడికి సహాయపడుటకు అన్ని సాంకేతిక సాధనాలు ఉంటాయి. వీటిలో కంప్యుటర్, నెట్వర్క్ హార్డ్వేర్ మరియు కావలసినంత సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
వేసవికాలం అనేది నాలుగు సమశీతోష్ణ కాలాల్లో వెచ్చని కాలంగా చెప్పవచ్చు, ఇది వసంతరుతువు మరియు ఆకురాలే కాలం మధ్య వస్తుంది. ఈ కాలంలో దీర్ఘకాల పగళ్లు మరియు తక్కువకాలం రాత్రిళ్లు సంభవిస్తాయి. ఈ కాలాలు ఖగోళ శాస్త్రం మరియు ప్రాంతీయ వాతావరణ శాస్త్రంపై ఆధారపడి వేర్వేరు సంస్కృతుల్లో వేర్వేరు తేదీల్లో ప్రారంభమవుతాయి.
గమనిక భగవద్గీత అధ్యాయానుసారం (సంస్కృతం తెలుగు లిపిలో) పూర్తి పాఠము వికీసోర్స్లో ఉంది. భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్లో ఉన్నది: భగవద్గీత (తెలుగు అనువాదము) భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్ యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపో యిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.
ఆంధ్ర రాష్ట్రం (Andhra State; Āndhra, IPA: [ˈɑːndʰrʌ]) భారతదేశంలో ఒక రాష్ట్రంగా 1 అక్టోబరు, 1953 తేదీన ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి మరియు హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా రిజర్వాయి యొక్క బేక్ వాటర్స్.
పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.