The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
Uttarashada okatava paadham dhanassu raasi ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాదియైన ఉగాది పండుగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించే సంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావడంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్త, సిద్ధాంతి, జ్యోతిష్కులు వంటివారెవరైనా చదివి, వ్యాఖ్యానించి, శుభాశుభ ఫలాలు వివరించి వినిపిస్తారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి లో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
కేశవ్ బలీరాం హెడ్గేవార్ (ఏప్రిల్ 1, 1889 - జూన్ 21, 1940) హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక హిందుత్వ భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో 1925వ సంవత్సరంలో స్థాపించారు. స్వామి వివేకానంద, అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
ఆటలమ్మ (Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.