The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
భారతదేశం యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు.అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలలో శాసనమండలి ఏర్పాటు చేయవచ్చు.రద్దు చేయవచ్చు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రంలోని శాసనసభ లో 2/3 మెజారిటీతో ఆమెదిచాలి.రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుత భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది.అవి ఉత్తరప్రదేశ్(100), బీహార్(75), కర్ణాటక(75), మహారాష్ట్ర(78),ఆంధ్ర ప్రదేశ్(58), తెలంగాణ(40).
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
ఆటలమ్మ (Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.
బలగం 2023లో విడుదలయిన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.
Uttarashada okatava paadham dhanassu raasi ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
హరి శివరాం రాజ్ గురు (1908 ఆగస్టు 24 - 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమకారుడు.. ఇతను భగత్ సింగ్, సుఖ్‌దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లతో పాటు ఉరితీసారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.