The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15వ శాసనసభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. శాసనసభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
"అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
కల్కి 2898 ఏ.డీ 2024లో విడుదల కానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.
భారత హోం వ్యవహారాల మంత్రి (లేదా హోమ్ మినిస్టర్) భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధిపతి. కేంద్ర మంత్రివర్గంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకడు. భారతదేశ అంతర్గత భద్రత నిర్వహణ హోం మంత్రి ప్రధాన బాధ్యతగా ఉంటుంది.దేశానికి చెందిన పెద్ద పోలీసు దళం దాని అధికార పరిధిలోకి వస్తుంది.హోమ్ మినిస్టరుకు అప్పుడప్పుడు, హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి, దిగువ స్థాయి హోం వ్యవహారాల సహాయ మంత్రి సహకారాలు అందిస్తారు.
అశ్విని వైష్ణవ్ (జననం 1970 జూలై 18) ఒక భారతీయ రాజకీయవేత్త, మాజీ ఐ ఏ ఎస్ అధికారి, ప్రస్తుతం 39వ రైల్వే మంత్రిగా, 55వ కమ్యూనికేషన్స్ మంత్రిగా, 2021 నుండి భారత ప్రభుత్వంలో 2వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్నారు. 2019 నుండి ఒడిశాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగించుటకు ఏర్పడిన రాష్ట్ర కాబినెట్ చేత 2014 జూన్ 8న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట కాబినెట్ మంత్రుల వివరాలు ఈ క్రింద పట్టికలో చూపబడ్డాయి.
ఆదిరెడ్డి భవాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కూతురు, శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన నాయుడు సోదరి.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది.
ద్రౌపది ముర్ము (జననం 20 జూన్ 1958) ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs యొక్క ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
18 వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలకు ఎన్నికలు 2024 మే 13 న జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నరేంద్ర మోడీ రెండవ మంత్రిత్వ శాఖ 2019లో ఏడు దశల్లో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రి మండలి. 17 వ లోక్‌సభ ఏర్పాటుకు రైసినా హిల్‌లోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బిమ్స్టెక్ దేశాల అధినేతలను గౌరవ అతిథులుగా ఆహ్వానించారు.