The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
"అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము.
నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖ నిర్వహించింది. సాధారణ సేల్స్ మేనేజర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి ఇందిరాగాంధీ తరువాత ఎదిగిన రెండువ వ్యక్తి నిర్మలా సీతారామన్, అందునా..
కింజరాపు ఎర్రన్నాయుడు (జ.23 ఫిబ్రవరి, 1957 -మ.2 నవంబర్, 2012 ) 11వ, 12వ, 13వ, 14వ లోక్ సభకు శ్రీకాకుళం స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
రామోజీ ఫిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. ఇది హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు 65వ నెంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది.
ద్రౌపది ముర్ము (జననం 20 జూన్ 1958) ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15వ శాసనసభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది. శాసనసభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.
జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.
అనుప్రియా పటేల్ (జననం 1981 ఏప్రిల్ 29) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె లోక్‌సభలో 2014 నుండి మీర్జాపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుత మోడీ మంత్రిత్వ శాఖలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి .ఆమె 2016 నుండి 2019 వరకు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
ఆదిరెడ్డి భవాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కూతురు, శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన నాయుడు సోదరి.
ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు) ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
జగత్ ప్రకాష్ నడ్డా, (జ:960 డిసెంబరు 2) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది.అతను 2019 జూన్ 19 నుండి 2020 జనవరి 20 వరకు బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 2020 జనవరి 20 నుండి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను నిర్వహించిన కేంద్ర మంత్రి. హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించాడు గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ (జననం 1969 జూన్ 26) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబరు 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఈయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2024-2025)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2024-2025) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2024 ఫిబ్రవరి 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్ఎల్వి ఎమ్కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు.
నితిన్ గడ్కరి మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త. మే 27, 1957న జన్మించిన గడ్కరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన అనేక నిర్మాణాత్మక పనులు ముఖ్యంగా ముంబాయి-పూనా ఎక్స్‌ప్రెస్‌వే వలన మంచిపేరు సంపాదించారు.